Begin typing your search above and press return to search.

పవన్‌తో పోటీకి సై అంటున్న దిల్ రాజు

By:  Tupaki Desk   |   26 Nov 2017 11:37 PM IST
పవన్‌తో పోటీకి సై అంటున్న దిల్ రాజు
X
తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తలపడడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. మిడిల్ క్లాస్ అబ్బాయి పేరుతో నాని హీరోగా ఆయన తీస్తున్న సినిమాను ఈ డిసెంబరులో విడుదల చేయాలని తొలుత అనుకున్నారు. అయితే... గత సంక్రాంతికి శతమానంభవతితో హిట్ కొట్టిన దిల్ రాజు ఈసారి కూడా సంక్రాంతి బరిలో తన సినిమాను ఉంచాలని అనుకుంటున్నాడట. అందుకోసం ఈ మిడిల్ క్లాస్ అబ్బాయిని పోస్ట్ పోన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే...ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పటికి ఉన్న లెక్కల ప్రకారం వచ్చే సంక్రాంతికి పవన్ కళ్యాన్ సినిమా రెడీగా ఉంది. అంటే దిల్ రాజు పవన్ సినిమాకు పోటీగా సంక్రాంతి బరిలో దిగుతున్నాడన్నమాట. పక్కా నిర్మాణ తెలివితేటలతో గత కొన్నేళ్లుగా మంచి హిట్ లు కొడుతున్న దిల్ రాజు సినిమా అంటే అందరికీ హడలే. పైగా ఈ సినిమాలో నాని హీరో. సో... పవన్ సినిమాకు దిల్ రాజు నుంచి గట్టి పోటీయే ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా దిల్ రాజు ఏకంగా చిరంజీవి - బాలయ్యలనే ఢీకొట్టి హిట్ కొట్టాడు. చిరంజీవి 150వ సినిమా ఖైదీనంబర్ 150 - బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణిలు మొన్నటి సంక్రాంతికి రిలీజ్ కాగా వాటితో పాటుగా దిల్ రాజు తీసిన శతమానం భవతి కూడా రిలీజైంది. రిలీజవడమే కాకుండా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

దీంతో వచ్చే సంక్రాంతికి దిల్ రాజు సినిమా వస్తుందనగానే పవన్ శిబిరంలో కాస్త కంగారు మొదలైందట. పవన్‌కు తిరుగులేని మార్కెట్ ఉన్నప్పటికీ నాని లాంటి వారు తీసే కాన్సెప్ట్ సినిమాలు పోటీ ఉంటె వాటితో కలెక్షన్స్ షేర్ చేసుకోవాలి . మరి ఏమవుతుందన్నది సంక్రాంతికి గానీ తెలియదు.