Begin typing your search above and press return to search.
దిల్ రాజు కొత్త వ్యూహం.. 'రంగస్థలం'తో ఆర్‌సీ15 కి లింక్
By: Tupaki Desk | 17 May 2022 4:35 AM GMTరామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆర్ ఆర్ ఆర్ సినిమా తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న రామ్ చరణ్ ఆచార్య సినిమాలో చిన్న పాత్రలో నటించి నిరాశ పర్చాడు. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా తో ఖచ్చితంగా మరోసారి పాన్ ఇండియా స్థాయిలో కుమ్మేయడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
తమిళ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజమౌళి స్థాయి దర్శకుడిగా ఆయనకు పేరు ఉంది. కనుక ఈ సినిమా పై అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట కూడా చాలా ఆసక్తి కనిపిస్తోంది. హీరోగా రామ్ చరణ్ కు ఆర్‌సీ 15 ఖచ్చితంగా నిలిచి పోయే సినిమా అవుతుంది అంటూ మెగా ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
ఆర్ సీ 15 సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ సమయంలో శంకర్ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేస్తాం అంటూ రామ్ చరణ్ పేర్కొన్నాడు. దిల్ రాజు కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా పలు సందర్బాల్లో పేర్కొన్నాడు. కాని ఇప్పుడు ఆయన ఆలోచన మారిందని.. కొత్త వ్యూహం అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
దిల్ రాజు ఇటీవలే తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా ను మొదలు పెట్టాడు. విజయ్ తన ప్రతి సినిమా కూడా మూడు నాలుగు నెలల కంటే ఎక్కువ సమయం పట్టకుండా చేస్తూ ఉన్నాడు. అందుకే ఏడాదికి రెండు సినిమాలను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాగలుగుతున్నాడు. అందుకే వంశీతో చేస్తున్న సినిమాను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల చేయాలని సూచించాడట.
విజయ్ సినిమా సంక్రాంతికి వస్తే రామ్ చరణ్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం దిల్ రాజుకు సాధ్యం కాదు. తన రెండు పెద్ద సినిమాలను ఒకే సీజన్ లో విడుదల చేయడం వల్ల తానే స్వయంగా నష్టపోతాడు. కనుక రామ్ చరణ్ సినిమాను రెండు నెలల ఆలస్యంగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ రంగస్థలం సినిమా మార్చి నెలలో విడుదల అయిన విషయం తెల్సిందే.
మార్చి చివరి వారంలో విడుదల అయిన రంగస్థలం భారీ విజయాన్ని సొంతం చేసుకుని చరణ్ కెరీర్ లో నిలిచి పోయే సినిమా అయ్యింది. అందుకే ఇప్పుడు అదే సెంటిమెంట్ తో దిల్ రాజు ఆర్ సీ 15 సినిమాను వచ్చే ఏడాది మార్చి చివరి వారంలో విడుదల చేయాలని భావిస్తున్నాడట. ఒకటి రెండు నెలల్లో ఆ విషయమై దిల్ రాజు నుండి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
చరణ్ అభిమానులకు ఆర్ సీ 15 విడుదల తేదీ మార్పు విషయం అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది. కాని రంగస్థలం సెంటిమెంట్ తో విడుదల చేస్తామంటూ ఖచ్చితంగా వారు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారనే నమ్మకం ఉంది. ఆర్ సీ 15 లో చరణ్ కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా అంజలి.. శ్రీకాంత్.. సునీల్ ఇంకా పలువురు తమిళ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.