Begin typing your search above and press return to search.

అన్నీ మంచి శకునములేనా?

By:  Tupaki Desk   |   27 Jan 2019 5:30 PM GMT
అన్నీ మంచి శకునములేనా?
X
కోలీవుడ్ లో గత ఏడాది అంచనాలే లేకుండా విడుదలైన అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చోటు దక్కించుకున్న 96 తెలుగు రీమేక్ అడుగులు ఒక్కొక్కటిగా పడుతున్నాయి. శర్వానంద్ సమంతాలతో దీన్ని తీయబోతున్నట్టు దిల్ రాజు ప్రకటన రూపంలో ఇచ్చేసారు కాబట్టి ఇక షూటింగ్ స్టార్ కావడమే ఆలస్యం. ఒరిజినల్ ఫీల్ మిస్ కాకుండా ఉండేందుకు ప్రేమ్ కుమార్ నే దర్శకుడిగా తీసుకున్న దిల్ రాజు అతని సలహా మేరకు మ్యూజిక్ డైరెక్టర్ గా గోవింద్ వసంతనే ఫిక్స్ చేసారు. ఇది ఒకందుకు మంచి నిర్ణయమే.

ఇప్పటికే శర్వానంద్ సమంతాల కాంబినేషన్ మీద పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. అయితే విజయ్ సేతుపతి త్రిషల మధ్య పండిన అద్బుతమైన కెమిస్ట్రీని తెరమీద పండించడం ఇద్దరికీ సవాలే. పైగా తమిళ్ వెర్షన్ ను సన్ టీవీలోనూ వివిధ రకాల ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమా మీద ఆసక్తి ఉన్నవాళ్లు చూసేసారు. అర్థం కాని వాళ్ళకు సబ్ టైటిల్స్ సహాయ పడ్డాయి. సో సహజంగానే దాంతో పోలిక వద్దన్నా వస్తుంది.

గతంలో ఇలాంటి సమస్యే మలయాళం ప్రేమమ్ ను నాగ చైతన్యతో రీమేక్ చేసినప్పుడు వచ్చింది. అది ఒరిజినల్ స్థాయిలో కాకపోయినా తెలుగు మార్కెట్ రేంజ్ లో మంచి హిట్ గా నిలవడంతో సేఫ్ అయ్యింది. మరి ఇప్పుడు 96 ఇలాంటివి అధిగమించాల్సి ఉంది. అందుకే స్క్రిప్ట్ రూపొందించే విషయంలో టైం తీసుకుని మరీ ప్రేమ్ కుమార్ టీం ఆ పనిలో ఉంది. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇలా మెయిన్ వెర్షన్ కు పని చేసిన టెక్నీషియన్స్ ని తీసుకోవడం మంచి ఐడియానే కాని ఇక్కడ నేటివిటీని దృష్టిలో ఉంచుకుని కీలకమైన మార్పులు చేయడం చాలా అవసరం.