Begin typing your search above and press return to search.
డీజే సక్సెస్ ఓర్వలేకపోతున్నారు -దిల్ రాజు
By: Tupaki Desk | 28 Jun 2017 4:58 PM GMTడీజే- దువ్వాడ జగన్నాధం మూవీకి తొలి రోజు నుంచే డివైడ్ టాక్ వచ్చిన మాట వాస్తవమే. అయితే.. ఆ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా వసూళ్లు వచ్చిపడ్డాయి. అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్ ఫిగర్స్ చాలా స్ట్రాంగ్ గానే ఉన్నా కూడా.. సినిమా గురించి నెగెటివ్ టాక్ మాత్రం అంతకంతకూ డబుల్ అయిపోతోంది. దీనంతటికీ కారణం కొందరు కావాలనే బ్యాడ్ ప్రోపగాండాతో నెగెటివ్ ప్రచారం చేయడం అంటున్నారు నిర్మాత దిల్ రాజు.
పని కట్టుకుని మరీ నెగిటివ్ కామెంట్లు.. పోస్టులు.. ట్రాలింగ్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతోందనేది ఆయన వాదన. ఇదంతా కొందరు తమ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా పని కట్టుకుని చేస్తున్నారని ఫిక్స్ అయ్యి .. సైబర్ క్రైమ్ అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేసేశారు దిల్ రాజు. డీజే సినిమా సక్సెస్ ను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని.. అందుకే తమ చిత్రాన్ని తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని చెప్పిన దిల్ రాజు.. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయాలని ప్రేక్షకులకు సూచించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వరకే డీజే మూవీ కలెక్షన్స్ 50 కోట్ల మార్కుకు చేరువయినట్లు తెలిపారాయన.
అయితే.. దువ్వాడ జగన్నాధంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ.. ఆధారాలతో సహా దిల్ రాజు కంప్లెయింట్ చేయడంతో.. వారిపై సైబర్ క్రైమ్ ఎలాంటి చర్యలు తీసుకోనుందనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీ జనాల ఆసక్తి కలిగిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/