Begin typing your search above and press return to search.
దిలా రాజు బాహుబలిని మిస్సయ్యాడా??
By: Tupaki Desk | 6 Aug 2016 3:30 PM GMTసినిమాలను కొనడం, రిలీజ్ చేయడం అనేది ఒక ఆర్టు. దానిని బాగా నేర్చుకుంటేనే సరైన రీతిలో పెట్టుబడి పెట్టి ఒక రూపాయి సంపాదించగలిగేది. అలా బాగున్న సినిమాలను కొనడంలో తెలుగు ఫిలిం ఇండస్ర్టీలో కొందరు నిష్ణాతులు ఉన్నారు. హ్యాపీ డేస్ సినిమాను కేవలం లక్షల్లో ఇన్వెస్టు చేసి కొంటే.. కోట్లలో లాభం పొందారంట దిల్ రాజు. ఆయన ఓ రెండు మూడు సినిమాల్లో నష్టపోయినా కూడా.. తరువాత చాలా సినిమాల్లో ఆయన నష్టపోయినా కూడా.. ఓకె బంగారం వంటి తెలివైన ఇన్వెస్టమెంట్లతో ఎప్పటికప్పుడు పంపిణీదారుడిగా తన పదునైన మైండ్ చూపిస్తూనే ఉన్నారు.
మొన్నామధ్యన 'బాహుబలిః ది బిగినింగ్' సినిమాను నైజాంలో రిలీజ్ చేసింది ఆయనే. అప్పట్లో ఆయన 23 కోట్ల నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ పద్దతిలో నైజాం ఏరియాకు సినిమాను కొంటే.. సినిమాకు షుమారు 40 కోట్లు వచ్చింది. ఆ లాభంలో ప్రొడ్యూసర్ కు ఎంత షేర్ ఇచ్చినా కూడా రాజు గారికి ఒక 12 కోట్లు ప్రాఫిట్టే అని ట్రేడ్ పండితులు అప్పట్లో చెప్పారు. అయితే ఇప్పుడు బాహుబలిః ది కంక్లూజన్ కొనాల్సి వచ్చేసరికి.. మ్యాగ్జిమం 40 కోట్లు పెట్టడానికి దిల్ రాజు రెడీ అయ్యారట. కాని అవతల సురేష్ బాబు ఏకంగా 50 కోట్ల వరకు ఆఫర్ చేయడంతో.. బాహుబలి 2 సినిమా నైజాం హక్కులను ఆయనకే అమ్మినట్లు తెలుస్తోంది.
అయితే బాహుబలి 2 టీమ్ సన్నిహితులు చెబుతున్న వివరాల ప్రకారం..మొత్తంగా సినిమా అమ్మకాలు పూర్తయినా కూడా.. తెలుగు రాష్ట్రంలలో మాత్రం ఇంకా అగ్రిమెంట్లు అవ్వలేదట. నవంబర్ నుండి బాహుబలి 2 ప్రమోషన్లకు కూడా స్టార్ చేయనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను మరింత వేగం చేసే ఛాన్సుందట. మరి దిల్ రాజు మరో ట్రయిల్ ఏమన్నా వేస్తారా? లెటజ్ సీ.