Begin typing your search above and press return to search.
'చెలియా'తోనైనా దిల్ రాజు కోలుకుంటాడా?
By: Tupaki Desk | 3 April 2017 7:49 AM GMTదిల్ రాజు... అసలు పేరు వేరే అయినా... సినీ జనాలతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన దిల్ రాజుగానే పరిచయం. శతమానం భవతి - నేను లోకల్ వంటి రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలతో దిల్ రాజు ఈ ఏడాదిని ఘనంగానే ప్రారంభించారనే చెప్పాలి. ఇదే ఊపులో ఆయన మరిన్ని చిత్రాలకు ప్లాన్ చేసేశారు. అంతా చకచకా జరిగిపోతున్న తరుణంలో దిల్ రాజుకు భారీ షాకే తగిలింది. దిల్ రాజు సతీమణి అనిత గుండె పోటు కారణంగా హఠాన్మరణం పాలయ్యారు. ఆ సమయంలో తాను తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన దిల్ రాజు... హుటాహుటినీ అన్నింటినీ పక్కన పడేసి వెనక్కు వచ్చేశారు.
అనితను పెళ్లి చేసుకున్న తర్వాతే... తన జీవితం సక్సెస్ ఫుల్ గా మారిందని ఎప్పుడూ చెప్పుకునే రాజు.. అనిత మరణంతో తీవ్ర విషాధంలోకి వెళ్లిపోయారు. అయితే పెద్ద పెద్ద చిత్రాలను నిర్మిస్తున్న దిల్ రాజు... ఆ షాక్ నుంచి కాస్తంత త్వరగానే కోలుకుంటారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా.. దిల్ రాజు ఇంకా భార్య స్మృతుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. భార్య మరణంతో దిక్కు తోచని స్థితిలో పడిపోయిన రాజు... అసలు తన వ్యవహారాలన్నింటిని కూడా పక్కన పడేశారట. భార్య మరణం విషాధం నుంచి రాజు ఎప్పుడు కోలుకుంటారా అని సినీ జనాలు ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే... రాజు ఇంట్లో విషాదం నేపథ్యంలో గత నెల 17న ఆయన బేనర్ ద్వారా రావాల్సిన ‘వెళ్లిపోమాకే’ చిత్రం వాయిదా పడిపోయింది. రాజు రిలీజ్ చేయాల్సిన మణిరత్నం సినిమా ‘చెలియా’ ఆడియో వేడుకలోనూ ఆయన కనిపించలేదు. ఈ నెల 7నే ఆ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. ప్రమోషన్ కూడా అంత బాగా ఏమీ జరగట్లేదు. రాజు ఫోకస్ పెట్టి ఉంటే ఈపాటికి పరిస్థితి మరోలా ఉండేదన్న వాదన వినిపిస్తోంది. తెలుగులో వేరుగా రిలీజయ్యేట్లుంటే సినిమాను వాయిదా వేసేవారేమో కానీ.. తమిళంతో పాటే తెలుగు వెర్షన్ కూడా విడుదల కావాల్సి ఉండటంతో అందుకు అవకాశం లేదు.
దీంతో లైట్ గా ప్రమోట్ చేస్తూ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. కాకపోతే ఈ వారం చెప్పుకోదగ్గ సినిమా ఇంకేదీ లేకపోవడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశం. పైగా మణిరత్నం సినిమా అంటే ప్రమోషన్ తో సంబంధం లేకుండా జనాలు థియేటర్లకు వచ్చేస్తారు. ‘చెలియా’ ప్రోమోలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి ఈ చిత్ర ఫలితం రాజులో కొంత ఉత్సాహం తీసుకొచ్చి.. ఆయనను షాక్ నుంచి తేరుకునేలా చేస్తుందేమో చూద్దాం .
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/