Begin typing your search above and press return to search.
దువ్వాడ దున్నుడు సరే.. మరి రూల్స్?
By: Tupaki Desk | 4 Jun 2017 5:55 AM GMTడీజే- దువ్వాడ జగన్నాధం.. టాలీవుడ్ లో సెన్సేషన్స్ సృష్టించడం ఖాయమని అంతా ఆశిస్తున్న మూవీ. ముందు నుంచి మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ చిత్రానికి.. ప్రస్తుతం ప్రమోషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మొదట 'శరణం భజే భజే - డీజే' అంటూ సాగే ఆడియో పాటను రిలీజ్ చేసిన యూనిట్.. ఆ తర్వాత 'గుడిలో బడిలో మడిలో' అంటూ సాగే పాటకు వీడియో ప్రోమో ఇచ్చింది.
ఈ వీడియో ప్రోమో యూట్యూబ్ లో సెన్సేషన్స్ తో పాటు.. జనాల్లోకి బాగానే దూసుకుపోయింది. వివాదాన్ని కూడా పట్టుకొచ్చింది. అయితే.. ఈ పాట విషయంలోనే డీజే టీం నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక సినిమాకి ప్రచార సామాగ్రిని నిర్మాత ఉపయోగించుకోవచ్చు. ఆడియో అయితే నేరుగానే మార్కెట్లోకి ఇచ్చేయచ్చు. కానీ వీడియోల విషయంలో మాత్రం తప్పనిసరిగా సెన్సార్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ డీజే విషయంలో ఇలా జరగలేదు. అదే ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. గుడిలో బడిలో పాటను నేరుగా యూట్యూబ్ లోకి ఇచ్చేశారు.
ఈ సాంగ్ ను దిల్ రాజు తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేయడంతో.. ఇప్పుడా మిస్టేక్.. దిల్ రాజు చేసినట్లే. అంత పెద్ద నిర్మాత అయిన దిల్ రాజుకు.. ఈ చిన్న పాయింట్ తెలిసి ఉండదని అనుకోవడానికి లేదు. కానీ పర్మిషన్ తీసుకోని మాట అయితే వాస్తవమే. దీన్ని డీజే టీం ఎలా డిఫెండ్ చేసుకుంటుందనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/