Begin typing your search above and press return to search.
దిల్ రాజుకిది మామూలు దెబ్బ కాదు
By: Tupaki Desk | 21 Feb 2016 5:30 PM GMTనిర్మాతల పేరు చూసి ప్రేక్షకులు సినిమాలకు రావడం అన్నది అరుదుగా జరుగుతుంటుంది. గత రెండు దశాబ్దాల్లో తెలుగు సినిమాల్ని పరిశీలిస్తే.. ఇలాంటి పేరు తెచ్చుకున్నవాళ్లలో మొదటి వాడు ఎమ్మెస్ రాజు. 2000 మొదట్లో.. వర్షం - నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలతో చాలా మంచి పేరు సంపాదించాడు ఎమ్మెస్ రాజు. దీంతో హీరో హీరోయిన్లు ఎవరు.. దర్శకుడెవరు అని చూడకుండా కేవలం ఎమ్మెస్ రాజు సినిమా అన్న నమ్మకంతో థియేటర్లకు రావడం మొదలుపెట్టారు జనాలు. కానీ ఈ పేరును ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయాడు ఎమ్మెస్ రాజు. వరుస ఫ్లాపులతో పూర్తిగా పేరు చెడగొట్టుకుని ఇండస్ట్రీ నుంచి అంతర్ధానమైపోయాడు.
ఎమ్మెస్ రాజు తర్వాత నిర్మాతగా తనకంటూ ఓ బ్రాండ్ వాల్యూ సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజే. ఎమ్మెస్ రాజు కంటే దిల్ రాజుకు చాలా గొప్ప పేరే వచ్చింది. ‘దిల్’ సినిమాతో మొదలుపెట్టి.. ఆర్య - బొమ్మరిల్లు - భద్ర, - కొత్త బంగారు లోకం లాంటి సినిమాలతో తెలుగు పరిశ్రమపై బలమైన ముద్ర వేశాడు రాజు. జడ్జిమెంట్ విషయంలో రాజుకు తిరుగులేదన్న గుర్తింపు వచ్చింది. ఆయన బేనర్లో సినిమా అంటే కచ్చితంగా కంటెంట్ ఉందన్న నమ్మకంతో జనాలు థియేటర్లకు రావడం మొదలైంది. కానీ మధ్యలో కొన్ని ఒడుదొడుకులు ఎదురయ్యాయి. అయినప్పటికీ ఆయన బ్రాండ్ వాల్యూ పెద్దగా ఏమీ దెబ్బ తినలేదు. దిల్ రాజుకు ఫ్లాపులు వచ్చినప్పటికీ.. మరీ చెత్త సినిమాలు మాత్రం తీయడు, రొటీన్ సినిమాలు చేయడు అన్న నమ్మకం ఇప్పటికీ జనాల్లో ఉంది. ఐతే ఈ మధ్య మాత్రం రాజు తన స్థాయికి తగ్గ సినిమాలు తీయట్లేదు. గత ఏడాది ఆయన బేనర్ నుంచి వచ్చిన కేరింత - సుబ్రమణ్యం ఫర్ సేల్ మామూలు సినిమాలే.
లేటెస్టుగా వచ్చిన ‘కృష్ణాష్టమి’ గురించి చెప్పాల్సిన పని లేదు. చాలా సినిమాల సన్నివేశాల్నే తిరగరాసి పరమ రొటీన్ సినిమాను అందించారు. దిల్ రాజు బేనర్ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. తన సినిమాల గురించి దిల్ రాజు చాలా నిజాయితీగా చెబుతాడని.. గొప్పలకు పోడని.. ఆయన ఓ సినిమా విషయంలో నమ్మకంగా మాట్లాడాడు అంటే అందులో కచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని జనాలకు ఓ భరోసా ఉండేది. ఐతే కృష్ణాష్టమి విషయంలో రాజు మాటలకు, సినిమాలో ఉన్న విషయానికి పొంతన లేదు. ఈ తరహా సినిమాలతో రాజుకు జరిగే ఆర్థిక నష్టం కంటే కూడా ఆయన క్రెడిబిలిటీకి జరిగే నష్టమే ఎక్కువ. ఈ ప్రభావం ఆయన తర్వాతి సినిమాల మీద కూడా చాలా పడుతుంది. ఇండస్ట్రీ అంతా రెగ్యులర్ సినిమాలు చేస్తున్నపుడు వైవిధ్యమైన సినిమాలతో అందరికీ స్ఫూర్తిగా నిలిచిన రాజు.. అందరూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్న టైంలో ఇలాంటి రొటీన్ సినిమాలు తీస్తుండటం విడ్డూరం. ‘కృష్ణాష్టమి’ ఫలితం చూశాకైనా ఆయన అప్రమత్తం కాకుంటే కష్టమే.