Begin typing your search above and press return to search.
బొమ్మరిల్లు.. కొత్తబంగారులోకం.. అంతుందా?
By: Tupaki Desk | 7 Dec 2016 7:30 PM GMT‘బొమ్మరిల్లు’ సినిమా దిల్ రాజు బేనర్లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలోనే ఒక క్లాసిక్. అలాగే దిల్ రాజు బేనర్లో ‘కొత్త బంగారు లోకం’ ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయింది. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ను ఈ రెండు సినిమాలతో పోల్చేస్తుండటం కొంచెం విడ్డూరంగా అనిపిస్తోంది. ఎంత దిల్ రాజుకు సినిమా నచ్చి.. తన బేనర్ మీద ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నప్పటికీ.. బొమ్మరిల్లు-కొత్త బంగారు లోకం లాంటి సినిమాలతో పోలికలు పెట్టేస్తుండటం అతిగా అనిపిస్తోంది.
ఈ సినిమాకు ముందు అనుకున్న టైటిల్.. నేను నా బాయ్ ఫ్రెండ్స్. ఆ టైటిల్ చూస్తే ఇదేదో బూతు సినిమాలా అనిపించింది. తర్వాత దిల్ రాజు ‘నాన్న’ అనే పదాన్ని టైటిల్ కు యాడ్ చేయమన్నారు. అయినప్పటికీ ఈ సినిమా టీజర్.. ట్రైలర్ చూస్తే రొమాన్స్.. ఎంటర్టైన్మెంట్ మీద ప్రధానంగా ఫోకస్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి అలాంటి సినిమాకు బొమ్మరిల్లు లాంటి క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పోలిక ఎలా వచ్చిందో? స్వయంగా దిల్ రాజు సైతం తన ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ మూవీని పోల్చేస్తున్నాడు.
భాస్కర్ బండి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్ నిర్మించాడు. హెబ్బా పటేల్.. రావు రమేష్.. నోయెల్.. పార్వతీశం.. నోయల్.. తేజస్వి ప్రధాన పాత్రలు పోషించిన ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ ఈ నెల 16నే ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరి ఇది బొమ్మరిల్లు.. కొత్త బంగారులోకం లాంటి మంచి సినిమాల కోవలోకి చేర్చదగ్గ మూవీనో కాదో ఆ రోజు చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/