Begin typing your search above and press return to search.
పోలీసోడు గురువారం రావట్లేదు
By: Tupaki Desk | 12 April 2016 5:04 PM GMTతమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన ‘తెరి’ మూవీ తమిళ సంవత్సరాది సందర్భంగా ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐతే తమిళంతో పాటే తెలుగులోనూ ఒకేసారి విడుదల చేయడానికి దిల్ రాజు శతదా ప్రయత్నించాడు కానీ.. ఆయన కోరిక నెరవేరలేదు. ‘తెరి’ తెలుగు వెర్షన్ ‘పోలీసోడు’ ఒక రోజు ఆలస్యంగా శుక్రవారం విడుదల కాబోతోంది.
డబ్బింగ్ వర్క్ ఏమైనా లేటైందో ఏంటో తెలియదు కానీ.. ‘పోలీసోడు’ గురువారం మాత్రం విడుదల కావట్లేదు. రిలీజ్ విషయంలో సందేహాలుండబట్టే.. డేట్ కన్ఫమ్ చేస్తూ పోస్టర్లు కూడా వదల్లేదు దిల్ రాజు. ఈ వారమే విడుదల అని మాత్రమే పోస్టర్లలో కనిపించింది. సోమవారం దాకా బుకింగ్స్ కూడా ఓపెన్ కాలేదు. మంగళవారం బుకింగ్స్ మొదలయ్యాయి కానీ.. శుక్రవారం నుంచే షోలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఒక్క ప్రసాద్ ఐమాక్స్ వరకు మాత్రమే టికెట్లు పెట్టారు.
ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. తమిళ వెర్షన్ ‘తెరి’ షోలు కూడా హైదరాబాద్ లో శుక్రవారం నుంచే మొదలవుతున్నాయి. కానీ తమిళనాడు సహా మిగతా ప్రాంతాల్లో మాత్రం తెరి గురువారమే రిలీజవబోతోంది. ఫారిన్లో బుధవారమే ప్రిమియర్స్ కూడా పడుతున్నాయి. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత రిలీజ్ చేస్తుండటంతో ‘పోలీసోడు’కు మంచి క్రేజే వచ్చింది కానీ.. ఈ అడ్వాంటేజీని సరిగా ఉపయోగించుకోవట్లేదు. ఇది మంచు విష్ణు-రాజ్ తరుణ్ ల సినిమా ‘ఈడోరకం ఆడోరకం’కు మాత్రం కలిసొచ్చేదే. ఈ సినిమా గురువారం సోలోగా రిలీజవబోతోంది.