Begin typing your search above and press return to search.
దిల్ రాజు మాటల్ని జనాలు నమ్మట్లేదా?
By: Tupaki Desk | 12 Aug 2018 1:30 AM GMTదిల్ రాజును తెలుగు సినీ పరిశ్రమలో జడ్జిమెంట్ కింగ్ అంటారు. ఆయన ఒక సినిమా నిర్మించినా.. ఏదైనా సినిమా హక్కులు కొని తన బేనర్లో రిలీజ్ చేసినా ప్రేక్షకులు ఒక నమ్మకంతో థియేటర్లకు వెళ్తారు. మధ్యలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా కొంత కాలం కిందటి వరకు ఆయన క్రెడిబిలిటీని కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఈ మధ్య ఆయన విశ్వసనీయత బాగానే దెబ్బ తిన్నట్లు కనిపిస్తోంది. రాజు చాలా భరోసాతో మాట్లాడుతున్న సినిమాలు తేడా కొట్టేస్తున్నాయి. వేసవిలో వచ్చిన నాని సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ను.. పూరి చిత్రం ‘మెహబూబా’ను హోల్ సేల్ గా కొని రిలీజ్ చేసింది దిల్ రాజే. ఆ రెండు సినిమాల్ని ఓ రేంజిలో పొగిడేశాడు రాజు. మరీ ‘మెహబూబా’ గురించైతే మామూలుగా చెప్పలేదు. కానీ ఆ రెండు సినిమాల ఫలితమేంటో తెలిసిందే.
ఐతే బయటి సినిమాలు కాబట్టి రాజు ప్రమేయం ఏమీ ఉండదులే అనుకోవచ్చు. కానీ రాజు నుంచి వస్తున్న సినిమాల్లోనూ క్వాలిటీ పడిపోతుండటం.. ఆయన చెబుతున్న మాటలకు.. సినిమాకు పొంతన లేకపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజు నుంచి గత నెలలో వచ్చిన ‘లవర్’ కనీస స్థాయిలో కూడా ఆడలేదు. ఎస్వీసీ బేనర్లో ఇంత సామాన్యమైన సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ‘శ్రీనివాస కళ్యాణం’ మరింతగా జనాలకు షాకిస్తోంది. ఇది తన బేనర్లో ఒక మైలురాయి అవుతుందని.. నితిన్ కెరీర్లో బెస్ట్ అని.. ‘బొమ్మరిల్లు’ అంత హిట్టవుతుందని.. ఇలా చాలానే చెప్పాడు రాజు. కానీ తీరా చూస్తే సినిమాలో అంత ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. రాజు మాటల్ని జనాలు ముందు నుంచే నమ్మలేదని దీని ఓపెనింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది. తొలి రోజే థియేటర్లలో ఆక్యుపెన్సీ తక్కువగా కనిపించింది. ఆ తర్వాత కూడా సినిమా పుంజుకోలేదు. దిల్ రాజు క్రెడిబిలిటీ ఆల్రెడీ దెబ్బ తినేసిందని ఓపెనింగ్స్ చాటిచెప్పగా.. ఈ సినిమా వల్ల జరిగిన డ్యామేజ్ రాబోయే సినిమాల మీదా ఎఫెక్ట్ చూపిస్తుందని భావిస్తున్నారు. ఇకముందైనా రాజు తన సినిమాల గురించి అతిగా చెప్పుకోవడం మానేస్తే బెటర్.