Begin typing your search above and press return to search.
దిల్ రాజుకు ఇంకో జాక్ పాట్
By: Tupaki Desk | 1 Jun 2016 1:30 PM GMTఎంత పెద్ద నిర్మాతకైనా.. ఎంత గొప్ప జడ్జిమెంటల్ స్కిల్స్ ఉన్నా.. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని సినిమాలు అటు ఇటు కావడం సహజం. దిల్ రాజు కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు ఈ మధ్య. ఇంతకుముందు భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాజు.. గత రెండు మూడేళ్లలో బాగా జోరు తగ్గించేశాడు. కొన్ని డిజాస్టర్లు.. కాస్ట్ ఫెయిల్యూర్లు రాజును కింద పడేశాయి. అయినా అందులోనూ ఈ ఏడాది ‘కృష్ణాష్టమి’ కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఈ సినిమాకు ఆర్థికంగా నష్టం చేకూర్చడమే కాదు.. కథల ఎంపికలో కింగ్ అని రాజుకున్న పేరును కూడా బాగా దెబ్బ తీసింది.
ఐతే దీని ఎఫెక్ట్ ‘సుప్రీమ్’ మీద పడకుండా ఆ సినిమాకు హైప్ తీసుకురావడంలో.. రూ.25 కోట్ల దాకా బిజినెస్ చేయడంలో.. విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ తెచ్చుకోవడంలో.. మంచి టైమింగ్ చూసి.. స్ట్రాటజిక్ గా రిలీజ్ చేయడంలో.. పెద్ద సినిమాల మధ్య దానికి థియేటర్ల సమస్య రాకుండా చూసుకుంటూ సరిగ్గా ప్రమోట్ చేసి కలెక్షన్లు పెంచడంలో.. ఫైనల్ గా ఆ సినిమాను సూపర్ హిట్ స్థాయికి తీసుకెళ్లడంలో దిల్ రాజు మాస్టర్ మైండ్ స్పష్టంగా కనిపిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా మీద మంచి లాభాల్ని అందుకున్న రాజుకు ఇప్పుడిక రీమేక్ రైట్స్ విషయంలోనూ జాక్ పాట్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి తొలి సినిమా ‘పటాస్’ తరహాలోనే ‘సుప్రీమ్’కు సైతం తమిళ-కన్నడ భాషల నుంచి రీమేక్ కోసం గట్టి పోటీ నెలకొన్నట్లు సమాచారం. ఫ్యాన్సీ ఆఫర్లతో రాజును సంప్రదిస్తున్నారట అక్కడి నిర్మాతలు. చైల్డ్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సాగే కథ అన్ని భాషల వాళ్లకూ కనెక్టవుతుందని భావిస్తున్నారు. మరోవైపు ‘సుప్రీమ్’కు శాటిలైట్ అయ్యిందీ లేనిదీ తెలియడం లేదు. ఒకవేళ ఇంకా రైట్స్ తన దగ్గరే పెట్టుకుని ఉంటే మాత్రం రాజుకు ఆ రకంగా కూడా బంపర్ ఆఫర్ తగలడం ఖాయం. మొత్తానికి మీడియం రేంజి బడ్జెట్ సినిమాతో భారీగానే వెనకేసుకుంటున్నట్లున్నాడు రాజు.