Begin typing your search above and press return to search.

యూవీని ఫాలో అవుతానంటున్న రాజు

By:  Tupaki Desk   |   31 Jan 2018 6:56 AM GMT
యూవీని ఫాలో అవుతానంటున్న రాజు
X
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరని అందరికి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ ఎండింగ్ కు వచ్చేసిందంటే చాలు. మరో రెండు సినిమాల షూటింగ్ లను పట్టాలెక్కించేస్తారు. టాలెంట్ ఉన్న దర్శకులను సక్సెస్ ఫుల్ కథలను ఎంచుకోవడంలో దిల్ రాజు తరువాతే ఎవరైనా.. అనే విధంగా తన బ్రాండ్ ను పెంచుకున్నారు. ఇక మొదట స్టార్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ వృత్తిని కూడా ఆయన మరవడం లేదు.

అయితే దిల్ రాజుకు పోటీగా యూవీ క్రియేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆ ప్రొడక్షన్ లో ఎక్కువగా డిజాస్టర్స్ లేవు అంటే ఏ లెవెల్లో సినిమాలను చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే దిల్ రాజు ఆ ప్రొడక్షన్ పై తన అభిప్రాయాన్ని చెప్పుకున్నాడు. రీసెంట్ గా బాగమతి సక్సెస్ మీట్ లో మాట్లాడిన దిల్ రాజు యూవీని చూస్తుంటే నన్ను నేను చేసుకున్నట్లు ఉంది.

ఎందుకంటే మొదట సిక్స్ ఇయర్స్ లో తాను ఆరు సినిమాలను చేసి 5 హిట్స్ అందుకున్నట్లు.. యూవీ కూడా అదే స్టైల్ లో వెళుతోంది. నేను తెలుగువరకే ఉంటే ఇంకా వారు మలయాళం హిందీలలో కూడా సినిమాలను చేస్తున్నారు. నెక్స్ట్ వారిలానే నేను ఫాలో అవుతాను అని దిల్ రాజు యూవీని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక చివరగా భాగమతి ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు చాలా థాంక్స్ అని దిల్ రాజు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.