Begin typing your search above and press return to search.

మోడీ అయితే ఏంటీ... లోకల్ ఇక్కడ!!

By:  Tupaki Desk   |   17 Nov 2016 4:23 AM GMT
మోడీ అయితే ఏంటీ... లోకల్ ఇక్కడ!!
X
పెద్ద కరెన్సీ నోట్లపై మోడీ వేసిన పంచ్ దెబ్బకు.. సినిమా ఇండస్ట్రీ విలవిల్లాడిపోతోంది. డైరెక్ట్ సినిమాలే కాదు.. డబ్బింగ్ బొమ్మలు కూడా థియేటర్లలోకి వచ్చేందుకు దడిసిపోతున్నాయి. ఇక సెట్స్ పై ఉన్న చాలా సినిమాలకు కూడా కరెన్సీ నోట్ల కొరత ప్రభావం చూపుతోంది. ఎవరి సంగతి ఎలా ఉన్నా.. నాని మాత్రం నేను లోకల్ అంటూ స్పీడ్ పెంచేస్తున్నాడు.

వరుస హిట్స్ తో జోరు మీద ఉన్న నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే మార్కెట్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయిపోగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డబ్బింగ్ తో పాటు ఇతర పనులు కూడా చకచకా పూర్తి చేసేస్తుండడం విశేషం. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం.. నేను లోకల్ కు సంబంధించిన వర్క్స్ పై కొంచెం కూడా పడకుండా చర్యలు తీసుకున్నారు నిర్మాత దిల్ రాజు అండ్ హీరో నాని.

ముందుగా సెట్ చేసుకున్న రిలీజ్ డేట్ టార్గెట్ డిసెంబర్ 25ను ఎట్టి పరిస్థితుల్లోను మిస్ అయ్యే పరిస్థితి లేదని తేల్చేస్తున్నారు కూడా. నానికి తొలిసారి కీర్తి సురేష్ జోడీ కట్టిన ఈ మూవీకి.. త్రినాధ్ రావు దర్శకుడు కాగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న మ్యూజిక్ హైలైట్ కానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/