Begin typing your search above and press return to search.
దిల్ రాజుకు గ్యారేజ్ లాభం 3 కోట్లు
By: Tupaki Desk | 19 Sep 2016 5:30 PM GMTభారీ సినిమాలపై ఆచితూచి పెట్టుబడి పెడుతుంటాడు దిల్ రాజు. రేటు మరీ ఎక్కువుంటే ఆయన సాహసం చేయడు. ఐతే ‘జనతా గ్యారేజ్’ విషయంలో మాత్రం రాజు రిస్క్ చేశాడు. ఆ సినిమా నైజాం హక్కుల్ని రూ.15 కోట్లు పెట్టి కొన్నాడు. ఇది పెద్ద రిస్కే అన్నారు చాలామంది. ఐతే దిల్ రాజు జడ్జిమెంట్ ఎలా ఉంటుందన్నది ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్లే రుజువు చేస్తున్నాయి. దిల్ రాజు పెట్టుబడి తిరిగి తేవడంతో పాటు రూ.3 కోట్ల లాభం కూడా తెచ్చిపెట్టింది ‘జనతా గ్యారేజ్’. ఈ సినిమా ఇప్పటికే రూ.18 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఇప్పటికీ సినిమాకు ఓ మోస్తరుగా కలెక్షన్లు వస్తున్నాయి.
నైజాం ఏరియాలోనే కాదు.. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ ‘జనతా గ్యారేజ్ బయ్యర్లు బ్రేక్ ఈవెన్ దాటేశారు. స్వల్పంగా లాభాలు అందుకున్నారు. ఈ చిత్రానికి రూ.65 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటిదాకా ఈ సినిమా రూ.79 కోట్ల దాకా షేర్ వసూలు చేసింది. సీడెడ్లో రూ.9 కోట్లకు హక్కులు తీసుకుంటే షేర్ రూ.11 కోట్లు దాటింది. ఆంధ్రాలో అన్ని ఏరియాలూ కలిపి రూ.27.85 కోట్ల షేర్ వసూలైంది. అందరూ లాభాలు అందుకున్నారు. కర్ణాటకలో 8.25 కోట్ల షేర్ రావడమూ పెద్ద విషయమే. మలయాళ వెర్షన్ రూ.1.7 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అమెరికాలో 1.8 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలైంది.