Begin typing your search above and press return to search.
'దిల్'రాజు హామీ ఇచ్చేశాడు .. ఇక 'అల్లరి'నరేశ్ దే ఆలస్యం!
By: Tupaki Desk | 25 Feb 2021 12:30 AM GMTదేనికైనా కాలం కలిసి రావాలి .. అప్పటివరకూ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూనే ఉంటాయి .. ఎన్ని ప్రయోగాలు చేసినా వికటిస్తూనే ఉంటాయి. 'అల్లరి' నరేశ్ విషయంలోను అదే జరిగింది. హాస్యకథానాయకుడిగా నరేశ్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు సంచలన విజయాలు సాధించకపోయినా, నిర్మాతలు భయంకరంగా నష్టపోయిన సందర్భాలు లేవు. అందువల్లనే ఆయన చాలా తక్కువ సమయంలోనే 50 సినిమాలను పూర్తి చేసేశాడు. మినిమం గ్యారెంటీ హీరో అనే ముద్ర వేయించుకున్నాడు.
కొంతకాలంగా ఆయనకి కాలం కలిసి రాలేదు .. కథలూ కలిసి రాలేదు. దాంతో ఎన్ని సినిమాలు చేసినా, హిట్టు కొట్టనంటూ బెట్టు చేశాయి. అలా వరుస సినిమాలు ఫ్లాప్ బాట పడుతూ ఉండటం నరేశ్ తో పాటు ఆయన అభిమానులను కూడా చాలా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇతర సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను చేయడానికి కూడా వెనుకాడలేదు. ఈ నేపథ్యంలో వచ్చిన 'నాంది' సినిమా ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎంతోకాలంగా ఆయన వెతుకుతున్న హిట్టును పట్టుకొచ్చి ఆయన చేతిలో పెట్టింది. నిర్మాతలకు లాభాలను పంచిపెట్టింది.
ఈ సినిమా చూసిన 'దిల్'రాజు .. స్వయంగా అభినందన సభను ఏర్పాటుచేసి మరీ అభినందించడం విశేషం. అంతేకాదు మంచి కథను సిద్ధం చేసుకుని వస్తే తన బ్యానర్ పై నిర్మిస్తానని ఆయన నరేశ్ కి హామీ ఇచ్చారు. కథలో కంటెంట్ ఉండాలేగానీ అది 'దిల్' రాజు కాంపౌండ్ దాటి బయటికి వెళ్లదు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా సినిమా చేస్తాడనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. అందువలన 'దిల్' రాజు మాటపై నరేశ్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. వైవిధ్యభరితమైన కథతో త్వరలో 'దిల్' రాజును కలిసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. 'దిల్' రాజుకు కథ నచ్చితే, దర్శకుడు ప్రత్యక్షం కావడం ఎంతసేపు?