Begin typing your search above and press return to search.

'ఫిదా' లేపేశారా? లేదా?

By:  Tupaki Desk   |   11 Aug 2017 1:07 PM GMT
ఫిదా లేపేశారా? లేదా?
X
ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలు వచ్చాయి. నేనే రాజు నేనే మంత్రి.. జయ జానకి నాయక.. లై సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయ్. ఈ ముడు సినిమాలూ ధియేటర్లలో సందడి చేయాలంటే మరి ఉన్న సినిమాలను తీసేయాల్సిందే. అలా అంటే.. దిల్ రాజు ఎంతో ప్రీతిపాత్రంగా చూసుకుంటున్న శేఖర్ కమ్ముల కూతురు ఉంది చూడండి.. అదేనండీ 'ఫిదా' సినిమా.. ఆ సినిమాను ఇప్పుడేం చేస్తున్నారు?

నిజానికి ఇవాళ రిలీజైన మూడు సినిమాల టిక్కెట్లు కొనడానికి వెళ్ళినప్పడు.. అక్కడ చాలామందికి బ్లాక్ బస్టర్ 4వ వారం అంటూ 'ఫిదా' పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఒక పక్కనేమో ఇటు జయ జానకి నాయక.. అటు లై సినిమాలను దిల్ రాజే డిస్ర్టిబ్యూట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలనూ ఒకేసారి రిలీజ్ చేయడం కారణంగా.. దానికితోడు తన స్నేహితుడు సురేష్‌ బాబు ధియేటర్లు ఇవ్వని కారణంగా.. అవన్నీ నేనే రాజు నేనే మంత్రికే ఇచ్చేసిన కారణంగా.. అసలు రాజు గారి దగ్గర ధియేటర్లే లేవు. పైగా ధియేటర్ ఓనర్లు కూడా కొత్త సినిమాలు కావాలని తహతహలాడుతుంటారు. అందుకే మరి ఫిదా సినిమాను ఎత్తేసి ఈ రెండు సినిమాలను దించాడా.. లేక ఫిదా అలాగే ఉంచి మరీ ధియేటర్లను సర్దుబాటు చేశారా అనేదే చూడాల్సి ఉంది.

ఏదేమైనా కూడా.. ఫిదా సినిమా తరువాత దిల్ రాజు పూర్తి స్థాయిలో కోలుకున్నారట. అంటే అప్పట్లో వరుస ఫ్లాపుల కారణంగా 100 కోట్ల పైగా అప్పుల్లో ఉన్నారని టాక్ ఉండేది. కాని ఈ ఏడాది శతమానం భవతి.. నేను లోకల్.. డిజె.. ఫిదా.. మాత్రం ఆయనకు పెద్ద ఉపకారమే చేశాయి. అది సంగతి.