Begin typing your search above and press return to search.
'వారసుడు' వివాదం అంతా మీడియా సృష్టేనట!
By: Tupaki Desk | 29 Nov 2022 7:30 AM GMTతమిళ స్టార్ హీరో విజయ్ తొలి సారి టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడి పల్లితో కలిసి చేస్తున్న మూవీ 'వారీసు'. ఈ మూవీని తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. 'సుల్తాన్' తరువాత రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న రెండవ తమిళ సినిమా ఇది. ఈ మూవీని తెలుగులో 'వారసుడు'గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే లిరికల్ వీడియోలతో ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టేశారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజు ఫిక్సయ్యాడు.
ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. 'వారసుడు' చుట్టూ థియేటర్ల వివాదం షురూ అయింది. ఈ మూవీ రిలీజ్ సమయంలో తెలుగు సినిమాలు 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహారెడ్డి' రిలీజ్ అవుతుండటం.. ఈ రెండు సినిమాలకు ప్రధాన ఏరియాల్లో థియేటర్లు లభించడం లేదనే కామెంట్ లు మొదలవ్వడంతో 'వారసుడు' చుట్టూ వివాదం స్టార్టయింది. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి వెంటనే స్పందించి పండగ సీజన్ లలో తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
దీంతో 'వారసుడు' వివాదం మరింతగా రాజుకుంది. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి చేసిన ప్రకటనపై తమిళ నిర్మాతలు ఘాటుగా స్పందించారు. విజయ్ సినిమాకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కేటాయించకపోతే పరిణామాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించారు.
ఆ తరువాత దర్శకుడు ఎన్. లింగుస్వామి స్పందిస్తూ ఏకంగా టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ పై బెదిరింపులకు దిగాడు. విజయ్ సినిమాకు థియేటర్లు కేటాయించని పక్షంలో 'వారీసు'కు ముందు 'వారీసు' తరువాత సినిమా అనే స్థాయిలో పరిస్థితులు మారతాయని తీవ్ర స్వరంతో బెదిరింపులకు దిగిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే 'వారసుడు' వివాదంపై దిల్ రాజు స్పందన మరోలా వుంది. అసలు థియేటర్ల వివాదమే లేదని తేల్చిపారేశాడు. 'వారసుడు' సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు మేలోనే ప్రకటించానని, ఆ తరువాతే 'వాల్తేరు వీరయ్య', వీర సింహారెడ్డి సినిమాల రిలీజ్ డేట్ లు ప్రకటించారని స్పష్టం చేశాడు. అంతే కాకుండా థియేటర్ల విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని, మైత్రీ వారితో తనకు మంచి అనుబంధం వుందని వాళ్లకు లేని బాద మిగతా వారికి ఎందుకో నాకు అర్థం కావడం లేదని ఎదురు ప్రశ్రించి షాకిచ్చాడు.
ఈ వివాదంపై విజయ్ ఫాదర్ ఎస్. ఏ. చంద్రశేఖర్ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. 'విజయ్ 'వారీసు' రిలీజ్ విషయంలో ఎలాంటి వివాదం లేదని, ఇదంతా మీడియా సృష్టేనని కొట్టి పారేశాడు. ఈ మధ్య మీడియా ప్రతీ దాన్ని పెద్దది చేసి చూపిస్తోందని.. విజయ్ 'వారీసు'కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అంతా మీడియా మీదికే తోసేశారు. అంతే కాకుండా విజయ్ ఫాదర్ గా చాలా గర్వపడుతున్నానని చెప్పుకొచ్చాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.