Begin typing your search above and press return to search.
సినిమాలు చూసి పాడవ్వట్లేదు -దిల్ రాజు
By: Tupaki Desk | 21 July 2017 4:52 AM GMTతెలుగు సినిమా పై ఇప్పుడు కొన్ని కోట్ల జతల కళ్ళు కొన్ని కోట్ల జతల చెవులు నిరంతరం పరిశీలిస్తునే ఉన్నాయి. అక్కడ ఏమి జరిగింది ఏమి జరుగుతుంది ఎవరు చేశారు ఎంత మంది చేశారు వీటి చుట్టూనే తిరుగుతుంది మీడియా అంతా. ప్రపంచం అంతా ఇక్కడ జరుగుతున్నా విషయం వలనే నడుస్తుంది అన్నంతగా సాగుతుంది మీడియా ప్రసారం ప్రచారం!! వార్తలు చెబుతునట్లు లేవు ఒక విచారణ వేడుకలు జరుపుకునట్లు ఉందక్కడ. సినిమా పరిశ్రమ పై వస్తున్న 'డ్రగ్స్ ఆరోపణల'పై నిర్మాత దిల్ రాజు ఘాటుగానే స్పందించారు.
“మేము సినిమా వాళ్ళమే కానీ సినిమా పరిశ్రమ లో ఏమి జరుగుతుంది ఎక్కడ ఎవరు చేస్తున్నారు అనేది మాకంటే మీకే(మీడియా) ఎక్కువ తెలుసు. కాబట్టి మీరే మాకు చెప్పాలి అసలు ఏమి జరుగుతోందో. సినిమా ఇండస్ట్రి అంటే ఒకరు ఇద్దరు కాదు ఇక్కడ కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. ఒక ఐదుగురు ఏదో డ్రగ్స్ వాడుతున్నారు అని తెలిస్తే మొత్తం ఇండస్ట్రి అంతా అదే పని చేస్తుందని ఎందుకు ప్రసారం చేస్తున్నారు'' అని ప్రశ్నించారు మీడియా వాళ్ళని. ''ఏమండి మీరే కదా దిల్ రాజు అంటే మంచి సినిమాలు నిర్మాత కుటంబ కథ చిత్రాలు నిర్మిస్తాడు మంచి విషయాలు ఉన్న కథలు ఎంచుకుంటాడు అని చెబుతారు. మరి నేను చెప్పిన ఆ మంచి మీరు ఎందుకు నేర్చుకోలేదు? శతమానం భవతి సినిమాను చూసి అందరూ పేరెంట్స్ ను బాగా చూసుకోవాలిగా. కాని అలా జరగట్లేదే. సినిమా అనేది కేవలం ఎంటర్టయిన్మెంట్ మాత్రమే. ఇంకేం కాదు. ప్రభావితం చేస్తుంది అనడం కూడా తప్పు. మనం చెడును తొందరగా నమ్మడానికి అలవాటుపడ్డాం అంతే కానీ సినిమాల వలన ఎవరు చెడిపోరు'' అని చెప్పారు.
''ఈ రోజులలో సినిమాలు కన్న సోషల్ మీడియా వలనే ఎక్కువ నష్టం జరుగుతుంది. సోషల్ మీడియా చూస్తుంటే భయం వేస్తోంది వాటి ప్రభావం సినిమా కన్న ఎక్కువగా ఉంది. ఏమి కావాలి అన్న క్షణాలలో తెలిసిపోతుంది మీ ఫోన్లలో. డ్రగ్స్ వాడటం తప్పే అది వాడే వారికే కాదు సమాజానికి కూడా అది హానికరం. దాని పై మా ప్రొడ్యూసర్లు అంతా ఒక కమిటీ వేసి పోలీసులుతో చర్చలు కూడా జరుపుతున్నాం తొందరలోనే వాటి పై ఒక చర్య తీసుకుంటాం'' అంటూ ముగించారు దిల్ రాజు.