Begin typing your search above and press return to search.
బండ్ల బదులు దిల్ రాజు బుక్కయ్యాడా?
By: Tupaki Desk | 8 April 2017 6:53 AM GMTదిల్ రాజును టాలీవుడ్లో చాలా తెలివైన నిర్మాతగా చెబుతారు. ఎవరో అనడం ఏంటి కానీ.. రాజు ఎంచుకునే సినిమాల్ని చూస్తేనే ఆయనెంత తెలివైన వాడో అర్థమవుతుంది. కథల ఎంపికలో కానీ.. సినిమాల్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరవేయడంలో కానీ ఆయనది అందెవేసిన చేయి. ఆయన అప్పుడప్పుడూ తమిళ డబ్బింగ్ సినిమాల్ని కూడా తెలుగులోకి అందిస్తూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కూడా ఆయనకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ‘వైశాలి’తో పాటు ‘ఓకే బంగారం’ కూడా ఆయనకు మంచి పేరు.. డబ్బూ రెండూ తెచ్చాయి. కానీ ఇప్పుడు ‘చెలియా’ మాత్రం రాజు జడ్జిమెంట్ ను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ సినిమాతో పేరు మాత్రమే కాదు.. డబ్బు కూడా బాగానే పోతుందనిపిస్తోంది.
‘చెలియా’ మీద దిల్ రాజు ఏడున్నర కోట్ల దాకా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ‘ఓకే బంగారం’ సినిమాకు నామినల్ రేటు ఇచ్చిన రాజు.. ఆ సినిమా హిట్టవడం.. పైగా కార్తి హీరో కావడంతో ‘చెలియా’ మీద అంతేసి పెట్టుబడి పెట్టాడట. కానీ ఇక్కడో ట్విస్టు ఏంటంటే.. ఇది నిజానికి బండ్ల గణేష్ చేతికి చేరాల్సిన సినిమా అట. ఏడాదిన్నర కిందట బండ్ల అఖిల్ హీరోగా ఓ సినిమా చేయాలనుకున్నాడు. అందుకోసం మణిరత్నంను సంప్రదించాడు. ఐతే ఆయన ఆ సినిమాకు కమిట్మెంట్ ఇవ్వకుండా ‘ఓకే బంగారం’ తర్వాత కార్తి-అదితి జోడీగా చేయాలనుకుంటున్న సినిమా గురించి చెప్పాడట. దీంతో బండ్ల కోటిన్నర అడ్వాన్స్ ఇచ్చి ఆ సినిమాను తనకిచ్చేలా కమిట్మెంట్ తీసుకున్నాడట. కానీ మధ్యలో ఏం డౌట్ కొట్టిందో ఏమో.. బండ్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుని అడ్వాన్స్ కూడా వెనక్కి తీసుకున్నాడట. ఐతే అప్పటికే ‘ఓకే బంగారం’తో మంచి ఫలితాన్నందుకున్న రాజు మళ్లీ మణి ప్రాజెక్టులోకి వచ్చాడు. ఈ సినిమా టాక్ చూస్తే ఆశాజనకంగా లేదు. మరి రాజుకు మోత ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/