Begin typing your search above and press return to search.
మహేష్ పై దిల్ రాజు బెట్టింగ్
By: Tupaki Desk | 29 May 2017 4:34 AM GMTమహేష్ బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్ హంగామా మొదలవడానికి బాగానే ఆలస్యం జరిగింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇవ్వడానికే బోలెడంత లేట్ కాగా.. ఇప్పుడు షూటింగ్ పూర్తి కావచ్చినా.. రిలీజ్ కి మరింత ఆలస్యం జరగనుంది. మొత్తానికి దసరాకి విడుదలకు సిద్ధమవుతున్న మహేష్ స్పైడర్.. సెన్సేషనల్ బిజినెస్ ఫిగర్స్ నమోదు చేసేస్తోంది.
స్పైడర్ నైజాం హక్కులను ఇప్పటికే విక్రయించారని అంటున్నారు. కొంత కాలంగా సినీ నిర్మాణం తప్ప.. డిస్ట్రిబ్యూషన్ కు దూరంగా ఉన్న దిల్ రాజు.. మహేష్ బాబు స్పైడర్ చిత్రానికి నైజాం రైట్స్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే.. ఇందుకోసం దిల్ రాజు చెల్లించిన మొత్తమే అందరినీ మైండ్ బ్లాంక్ చేసేస్తోంది. మురుగదాస్- మహేష్ కాంబినేషన్ లో రూపొందిన స్పైడర్ కోసం.. ఏకంగా 25 కోట్ల రూపాయలకు దిల్ రాజు డీల్ సెట్ చేసుకున్నారట. నైజాంలో బాహుబలి2 మినహాయిస్తే.. ఇప్పటివరకూ ఇదే అతి పెద్ద డీల్ కావడం విశేషం. అయితే.. ఇక్కడ బాహుబలి..2 70 కోట్ల షేర్ వసూలు చేయడం గమనిస్తే.. నైజాం స్టామినా ఏంటో అర్ధమవుతుంది.
మరోవైపు మహేష్ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు నైజాంలో 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే.. స్పైడర్ బ్రేక్ ఈవెన్ కు రావాలంటేనే.. శ్రీమంతుడు కంటే 25పర్సెంట్ అధికంగా షేర్ రావాలి. అలాగే ఖైదీ నంబర్ 150..కాటమరాయుడు చిత్రాలను కూడా ఇక్కడ 20 కోట్లకే విక్రయించారు. ఇప్పుడు ఏకంగా 25 కోట్లకు స్పైడర్ మూవీ నైజాం రైట్స్ కొని.. సెన్సేషన్ సృష్టించేస్తున్నారు దిల్ రాజు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/