Begin typing your search above and press return to search.
పిల్లబ్యాచ్ మీద కంప్లైంట్ ఇచ్చిన దిల్ రాజు
By: Tupaki Desk | 20 Dec 2017 4:12 PM GMTసినిమాల్ని పీల్చి పిప్పి చేసే పైరసీకి సంబంధించి సరికొత్త విషయాన్ని వెల్లడించారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు. కొత్త సినిమాలు విడుదలైనంతనే పైరసీ సీడీలు బయటకు రావటం వెనుక.. ఇప్పటి వరకూ ఎవరూ బయట పెట్టని కొత్త కోణాన్ని దిల్ రాజు వెలికి తీశారు. పైరసీ ముఠా టాలీవుడ్ నిర్మాతల్ని బ్లాక్ మొయిల్ చేస్తోందని.. కొత్త సినిమా రిలీజ్ అయినంతనే పైరసీ రాకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించాలన్న వార్నింగులు వస్తున్నట్లు తాజాగా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ రోజు (బుధవారం) సైబర్ క్రైం ఏసీపీ రఘువీర్ తో సినీ ప్రముఖులు దిల్ రాజు.. ఎస్ రాధాకృష్ణ.. అల్లుశిరీష్ లు సమావేశమయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాగ్ ఫ్యామిలీకి సంబంధించిన వారు కూడా ఈ మీటింగ్‌కు రావాల్సి ఉందని చెబుతున్నారు. ఇంతకీ సైబర్ ఏసీపీతో అంత పెద్ద నిర్మాత.. సినీ ప్రముఖులు ఎందుకు సమావేశం కావటమంటే.. పైరసీకి సంబంధించిన కీలకఅంశాల్ని చూసే అధికారి కావటంతో అసెంబ్లీ దగ్గర్లోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు రావాల్సి వచ్చింది.
ఈ సందర్భంగా పైరసీ ఎలా చేస్తున్నారన్న విషయంపై కొత్త విషయాల్ని వెల్లడించారు చిన్నపిల్లలకు డబ్బులు ఆశ చూపించి వారి చేత అక్రమంగా రికార్డు చేస్తున్నట్లు ఆరోపించారు. సినిమా విడుదలకు ముందే తమకు బిట్ కాయిన్ల రూపంలో డబ్బులు చెల్లించాలని బెదిరిస్తున్నారన్నారు. లేనిపక్షంలో పైరసీ సీడీల్ని ఇంటర్నెట్‌లో అప్ లోడ్ చేస్తామని వారు చెప్పారన్నారు. ఈ తరహా వార్నింగ్ లు సినీ పరిశ్రమలో పలువురు నిర్మాతలకు వస్తున్నాయని.. దీనికి సంబంధించి ఇప్పటికే ముగ్గురిపై తాము ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై స్పందించిన పోలీసు వర్గాలు.. పైరసీని అడ్డుకునేందుకు సరికొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లుగా చెప్పారు. గతంలో మాదిరి పిర్యాదు చేయనప్పటికీ కొత్త సినిమాని పైరసీ చేస్తే.. వెనువెంటనే వాటిని డిలీట్ చేసే విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది.