Begin typing your search above and press return to search.

దిల్ రాజు ఎందుకు డైరెక్షన్ చేయడంటే

By:  Tupaki Desk   |   6 Jun 2017 5:02 AM GMT
దిల్ రాజు ఎందుకు డైరెక్షన్ చేయడంటే
X
దువ్వాడ జగన్నాధం అంటూ తను నిర్మాతగా 25 చిత్రాన్ని అందిస్తున్నాడు దిల్ రాజు. అల్లు అర్జున్ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి.. రీసెంట్ గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు నిర్మాత. ఈ సందర్భంగా తనతో సినిమాలు చేసిన దర్శకులు అందరినీ స్టేజ్ పైకి తీసుకురావడం విశేషం.

'ఒక సినిమా ఫెయిల్యూర్స్ అయిందంటే అది దర్శకుడి ఒక్కడిదే బాధ్యత కాదు. ఆ సినిమా కథ ఎంచుకున్న నిర్మాత.. స్టోరీని ఒప్పుకుని నటించిన హీరోతో పాటు అనేక మందికి బాధ్యత ఉంటుంది. నేను 25వ అందిస్తున్నానంటే.. అందుకు ఇంతమంది దర్శకులు వెంట ఉండి నడిపించడమే కారణం. 50 వరకూ అయితే చేసేందుకు ప్రయత్నిస్తాను. 100 అవుతుందో లేదో ఇప్పుడు చెప్పడం కష్టమైన విషయం' అన్న దిల్ రాజు.. తనను దర్శకత్వం వహించమని పలువురు దర్శకులు చెప్పడంపై స్పందించాడు.

'నేను దర్శకత్వం వహించే పని మాత్రం చేయాలని అనుకోవడం లేదు. అసలు డైరెక్షన్ చేయను కూడా. ఎందుకో కారణం కూడా చెబుతాను. నేను నిర్మాతగా సింపుల్ గా ఈ కథ బాగుంది.. బాలేదు.. లోపాలున్నాయ్ అని చెప్పేసి ఊరుకుంటాను. కానీ ఓ మూవీని సక్సెస్ చేసేందుకు మీరందరూ పడే తపన.. కష్టం.. తాపత్రయం ఇవన్నీ చూసిన తర్వాత.. దర్శకత్వం మాత్రం చేయకూడదని ఫిక్స్ అయిపోయాను' అన్నాడు దిల్ రాజు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/