Begin typing your search above and press return to search.
స్రవంతి సోపేశాడనుకున్నా! - దిల్ రాజు
By: Tupaki Desk | 13 Oct 2018 7:31 PM GMTరామ్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన సినిమా `హలో గురూ ప్రేమకోసమే`. అక్టోబర్ 18న ఈ సినిమా రిలీజవుతోంది. నేటి సాయంత్రం హైదరాబాద్ జేఆర్‌సీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ షూటింగ్ అనుభవాల్ని వెల్లడించారు.
దిల్ రాజు మాట్లాడుతూ -``సడెన్‌గా సినిమాని మించి ఒకటి చెప్పాలి. లైఫ్ లో బోలెడు చూస్తాం. స్పోర్ట్స్ లో ఆరోజు ఓడి తర్వాత గెలుస్తారు. పొలిటీషియన్లకు, సినిమా వాళ్లకు సక్సెస్‌లు వస్తాయి. ఫెయిల్యూర్స్ వస్తాయి. సక్సెస్ ఫెయిల్ కామన్. అయితే సక్సెస్ కోసమే కొందరు ట్రావెల్ అవుతారు. అందుకు ఎగ్జాంపుల్ రవికిషోర్.. ఆయనను 30 ఏళ్లుగా చూస్తున్నా. ఇప్పటికీ సినిమాలు తీస్తున్నారు. 2016లో ఆయన అమృత సినిమాకి రవికిషోర్ కృష్ణ జిల్లా డిస్ట్రిబ్యూషన్ గురించి అడిగారు. నేను డౌన్ అయినప్పుడు అది గుర్తొస్తుంది. అప్పుడు రవికిషోర్ ఒక మాటన్నారు. అంత హార్డ్ మ్యాటర్‌ని ఇంత స్మూత్ గా డీల్ చేశావ్. పెద్ద నిర్మాత అవుతావు! అని అన్నారు. సోపేసాడేమో అనుకున్నా. ఆ తర్వాత బొమ్మరిల్లు సక్సెస్‌మీట్ లో ఆయన మళ్లీ ఆ మాట గుర్తు చేశారు. సినిమాల విషయంలో నేను ప్రతిదీ పాజిటివ్‌గా తీసుకుంటాను.
`నేను లోకల్` తర్వాత రైటర్ ప్రసన్న ఫోన్ చేసి ఐడియాస్ ఉన్నాయి... స్క్రిప్టు చెప్పాలి అన్నాడు. హలోగురూ ప్రేమకోసమే కథతో పాటు వేరే స్టోరి చెప్పారు. మొదటిది ఎంటర్‌టైన్‌మెంట్.. అందులో కొత్తగా ఏం ఉందని వేరే స్టోరి సెలక్ట్ చేసుకున్నా. ఈలోపు ప్రకాష్ రాజ్‌గారు హలో గురూ కథ విని ఇది హిలేరియస్ కామెడీ సినిమా అవుతుంది. ఎందుకు ఎంపిక చేసుకోలేదు అని అడిగారు. అప్పుడు ప్రసన్న వచ్చి మళ్లీ కథ చెప్పాడు. ఆ తర్వాత రామ్‌ని కలిసి కథ చెప్పాం. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఓ ఆసక్తికరమైన నావెల్ పాయింట్ డ్రైవ్ చేస్తుంది. ముఖ్యంగా సినిమాలో 1.10 నిమిషాల పాటు నవ్వుతూనే ఉంటారు. ఇందులో దేవీశ్రీ ఐదు అద్భుతమైన పాటలు అందించాడు.. అని తెలిపారు.