Begin typing your search above and press return to search.

దిల్ రాజు సమర్పించు ‘కాలా’

By:  Tupaki Desk   |   4 March 2018 7:33 AM GMT
దిల్ రాజు సమర్పించు ‘కాలా’
X
రజినీకాంత్ చివరి సినిమా ‘కబాలి’ టీజర్ రిలీజ్ కాకముందు వరకు దానికి తెలుగులో అంతగా బజ్ లేదు. కానీ టీజర్ చూశాక ఆ సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చి.. ఫ్యాన్సీ రేటుకు సినిమాను కొన్నారు. తర్వాత ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిందే. ఆ సినిమా అంచనాల్ని అందుకోవడంలో విఫలం కావడం.. సినిమాను కొన్న వారికి నష్టాలు తప్పకపోవడంతో ‘కబాలి’ కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త సినిమా ‘కాలా’కు ఆశించిన స్థాయిలో బజ్ రాలేదు. ఇప్పటిదాకా ఆ సినిమాకు తెలుగులో బిజినెస్ కూడా కాలేదు. ఇది నిర్మాత ధనుష్ కు ఆందోళన కలిగించింది. ఐతే ‘కబాలి’ తరహాలోనే ‘కాలా’ టీజర్ రిలీజయ్యాక సీన్ మారినట్లు సమాచారం.

‘కాలా’ను రిలీజ్ చేయడానికి ఒక పెద్ద నిర్మాతే ముందుకొచ్చినట్లు సమాచారం. ఆ నిర్మాత మరెవ్వరో కాదు దిల్ రాజు. ఇంతకుముందు మణిరత్నం సినిమాలు ‘ఓకే బంగారం’.. ‘చెలియా’లతో పాటు ‘వైశాలి’ లాంటి డబ్బింగ్ సినిమాను కూడా దిల్ రాజు తన బేనర్ ద్వారా రిలీజ్ చేశాడు. ‘చెలియా’ ఫ్లాప్ కావడంతో ఆయన మళ్లీ డబ్బింగ్ సినిమాల జోలికి పోలేదు. ఐతే ‘కాలా’ ఆయన దృష్టిని ఆకర్షించింది. ‘కబాలి’ అనుభవం నేపథ్యంలో దిల్ రాజు భారీ రేటు అయితే పెట్టడానికి రెడీగా లేరని సమాచారం. ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో బిజినెస్ ఆఫర్లు కూడా లేకపోవడం.. దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాత రిలీజ్ చేస్తే సినిమాకు కలిసొస్తుందన్న ఉద్దేశంతో ధనుష్ కూడా రేటు విషయంలో బెట్టు చేయకుండా కొంచెం తక్కువకే ఇవ్వడానికి అంగీకరించాడట. దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్న విషయంలో త్వరలోనే అధికారికంగా వెల్లడవుతుందని సమాచారం.