Begin typing your search above and press return to search.
పవన్ ని ఛేజ్ చేయడంలో దిల్ రాజు రేర్ రికార్డ్
By: Tupaki Desk | 5 April 2021 5:30 PM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` ప్రచార వేదికపై తన నిర్మాత దిల్ రాజును ప్రశంసించిన తీరు అంత తేలిగ్గా మర్చిపోలేనిది. నిర్మాతలుగా పంపిణీదారుగా ఏడాదికి 50 సినిమాలతో ప్రత్యక్ష పరోక్షంగా సంబంధాలు కలిగి ఉండే నిర్మాత కం పంపిణీదారు కం ఎగ్జబిటర్ గా దిల్ రాజు ఎదిగారు. ఇండస్ట్రీలో ఎంతో శ్రమించి ఎదిగిన వ్యక్తిగా దిల్ రాజును అభిమానిస్తానని పవన్ అన్నారు. దానికి దిల్ రాజు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
రాజుగారు ఎంత సాధించినా కానీ ఎందరు హీరోలతో పని చేసినా కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేయలేకపోయామనే అసంతృప్తితోనే ఇన్నేళ్లు గడిపారు. తొలి ప్రేమను పంపిణీ చేసేప్పటికి చిన్న పంపిణీదారు. అప్పుడే తొలి అడుగులు వేస్తున్నారు. అందువల్ల పవన్ ని దూరం నుంచి చూడడమే కానీ దగ్గరగా కలవలేకపోయారట. చేస్తే పవన్ తో సినిమా చేయాలన్న ఆలోచన అప్పుడే బీజం పడిందని కానీ తాము ఇంకా పంపిణీదారులే కానీ నిర్మాత కాలేదని దిల్ రాజు వకీల్ సాబ్ వేడుకలో తెలిపారు. తొలి ప్రేమ రిలీజ్ తర్వాత రోజూ జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద పవన్ ఇంటికి వెళ్లి కలిసి ఐదు నిమిషాలు అయినా మాట్లాడేవారట. ఆ తర్వాత కూడా ఖుషీ సినిమాని రిలీజ్ చేశాక పవన్ తో సినిమా చేయాలనుకున్నారు. కానీ డేర్ చేసి చెప్పలేదు.
ఆర్య సినిమా ఓపెనింగ్ కు పవన్ - చిరంజీవి అతిథులుగా వచ్చారు. అప్పుడు మరోసారి అనుకున్నారు. చాలా సార్లు ఇలా అనుకున్నాం కానీ కుదరలేదు. మనసులో ఉన్నది చెప్పలేకపోయాం. గబ్బర్ సింగ్ నైజాం రిలీజ్ చేసినపుడు కళ్యాణ్ గారితో సినిమా చేయాలని ఉందని హరీశ్ శంకర్ తో తరుచూ చెబితే సంకల్పం గెలుస్తుందని అతడు అనేవాడట.
పవన్ రాజకీయాల్లోకి వెళ్లాక ఇక ఆ అవకాశం ఉండదనుకున్నామని కానీ పింక్ రీమేక్ రూపంలో అదృష్టం తమ తలుపు తట్టిందని దిల్ రాజు అన్నారు. క్యూలో ఎందరు ఉన్నా అనుభవం చూసి పవన్ అవకాశమిచ్చారని తెలిపారు. బోనీకపూర్ పింక్ ట్రైలర్ పంపగానే అది పవన్ కి అయితే బావుంటుందని హరీష్ తో చర్చించి నిర్ణయించుకున్నా.. తర్వాత పవన్ ని కలవలేకపోయామని.. అల వైకుంఠపురములో సెట్స్ కి వెళ్లాక త్రివిక్రమ్ తో చెప్పగానే ఇది వర్కవుట్ అయ్యిందని దిల్ రాజు వెల్లడించారు. బోనీకపూర్.. హరీష్.. త్రివిక్రమ్ .. వేణు శ్రీరామ్ వల్లనే ఈ సినిమా చేయగలిగానని తెలిపారు. దిల్ రాజు పవన్ ని ఛేజ్ చేయడం వెనక అంత చరిత్ర ఉందన్నమాట!