Begin typing your search above and press return to search.
అలా చేయకుంటే..నితిన్ ని కొడతారు:దిల్ రాజు
By: Tupaki Desk | 26 July 2018 11:42 AM GMTదిల్ సినిమా తో ప్రముఖ నిర్మాత రాజు....`దిల్` రాజు గా మారిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్ లోని బడా నిర్మాతలలో ఒకరిగా ఎదిగారు. తాజాగా, `దిల్` హీరో నితిన్ తో కలిసి `శ్రీనివాస కల్యాణం`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న దిల్ రాజ్....నితిన్ గురించి - ఈ చిత్ర విడుదల తేదీ గురించి ఆసక్తి కర విషయాలు వెల్లడించారు. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా...స్టేజీ మీద నితిన్...త్వరలో పెళ్లి చేసుకుంటానని వాళ్ల మదర్ కి మాటిచ్చాడని....కాబట్టి ఈ సినిమా తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకోవాల్సిందేనని చమత్కరించారు. ఈ సినిమా చూసిన తర్వాత జనాల ....రెస్సాన్స్ ను నితిన్ తట్టుకోలేడని - ఒక వేళ చేసుకోకుంటే.....నితిన్ ను జనాలు కొడతారని ...సో పెళ్లి చేసుకుంటాడని సెటైర్ వేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన మొదటి రోజే ఆగస్టు 9న విడుదల చేద్దామని డిసైడ్ అయ్యామని దిల్ రాజు అన్నారు.
తనకు ఆగస్టు 9 అచ్చొచ్చిన తేదీ అని అన్నారు. 2009 ఆగస్టు 9న బొమ్మరిల్లు రిలీజ్ అయి తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ అయిందని - మళ్లీ ఇపుడు 12 ఏళ్ల తర్వాత అదే డేట్ కు `శ్రీనివాస కల్యాణం` రిలీజ్ కాబోతోందని అన్నారు. ఆ రోజు మహేష్ బాబు బర్త్ డే అని - తమ బ్యానర్ లో మహేష్ తో ఓ సినిమా చేస్తున్నామని అన్నారు. ఈ సినిమాలో పెళ్లి గురించిన కాన్సెప్ట్ పై కొత్త అనుభూతి పొందుతారని,...ఈ సినిమాలో సంప్రదాయ - మానవతా విలువల గురించి దర్శకుడు చక్కగా వివరించారని అన్నారు. యూత్ తో పాటు అందరినీ ఈ చిత్రం ఆకట్టుకుంటుందన్నారు. తన లైఫ్ లో జరిగిన ఘటనలకు ఈ సినిమా రిలేట్ అయిందని....తన భార్య చనిపోయిన ఘటననను దిల్ రాజు గుర్తు చేసుకున్నారు. తన లైఫ్ మాత్రమే కాదని...పుట్టుక - పెళ్లి - చావు...ఇవి ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతాయని....ప్రతి ఒక్కరు తమను తాము రిలేట్ చేసుకుంటారని దిల్ రాజు అన్నారు.