Begin typing your search above and press return to search.

లాయర్‌ సాబ్‌ కు దిల్‌ రాజు వేసిన లెక్కలు ఇవే

By:  Tupaki Desk   |   5 Feb 2020 5:49 AM GMT
లాయర్‌ సాబ్‌ కు దిల్‌ రాజు వేసిన లెక్కలు ఇవే
X
2016లో వచ్చిన బాలీవుడ్‌ పింక్‌ మూవీ కేవలం 23 కోట్ల బడ్జెట్‌ తో రూపొందింది. అమితాబచ్చన్‌.. తాప్సి ఇంకా ఇతర స్టార్స్‌ పారితోషికాలు కలిపి కూడా ఇంతే బడ్జెట్‌ అయ్యిందట. సినిమా ఎక్కువగా ఒక కోర్టు హాల్‌ లో నడుస్తుంది. అలాగే సినిమా లో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఏమీ అక్కర ఉండదు. కనుక తక్కువ బడ్జెట్‌ తోనే పూర్తి అయ్యింది. ఇక తమిళంలో దీన్ని గత ఏడాది రీమేక్‌ చేశారు. అక్కడ కూడా అజిత్‌ పారితోషికం కాకుండా 25 కోట్ల రూపాయల లోపు బడ్జెట్‌ తోనే పూర్తి చేశారట. ఇప్పుడు అదే ఫార్ములాను తెలుగు రీమేక్‌ కు దిల్‌ రాజు వర్కౌట్‌ చేస్తున్నాడు.

పవన్‌ సినిమా అనగానే హంగు ఆర్భాటం చేస్తూ ఉంటారు. కాని దిల్‌ రాజు మాత్రం అలాంటివి ఏమీ లేకుండా ఒరిజినల్‌ వర్షన్‌ కు ఏమాత్రం తీసిపోకుండా రీమేక్‌ ను నిర్మిస్తున్నాడట. ఈ చిత్రానికి దిల్‌ రాజు పెడుతున్నది 75 కోట్లుగా ప్రచారం జరుగుతుంది. అందులో 50 కోట్లు పవన్‌ కు రెమ్యూనరేషన్‌ కాగా 25 కోట్ల రూపాయలు సినిమా ఇతర బడ్జెట్‌ అంటున్నారు.

పవన్‌ సినిమా కనుక అది కూడా పవన్‌ రీ ఎంట్రీ మూవీ కనుక జనాల్లో పిచ్చ క్రేజ్‌ ఉంది. కనుక బయ్యర్లు ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ఖచ్చితంగా పోటీ పడతారు. దాంతో థియేట్రికల్‌ రైట్స్‌ మరియు ఇతర్రత రైట్స్‌ కలిపి 100 నుండి 110 కోట్లకు అమ్ముడు అయ్యే అవకాశం ఉందట. దాంతో నిర్మాతలకు ఈజీగా పాతిక కోట్ల వరకు లాభాలు రావడం ఖాయం అంటున్నారు. సినిమా సక్సెస్‌ అయితే వచ్చే కలెక్షన్స్‌ అదనంగా చెప్పుకోవచ్చు.

ఈ సినిమాను బోణీ కపూర్‌ తో కలిసి దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు. అయితే నిర్మాణంలో మెజార్టీ షేర్‌ దిల్‌ రాజుదే అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కనుక లాయర్‌ సాబ్‌ చిత్రంతో దిల్‌ రాజుకు ఖచ్చితంగా 15 నుండి 20 కోట్ల వరకు ఫ్రాఫిట్‌ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. పవన్‌ తో సినిమా తీయాలనే కోరిక తీర్చుకోవడంతో పాటు దిల్‌ రాజు ఈ చిత్రం తో లాభాల పంట పండించుకోబోతున్నాడు.