Begin typing your search above and press return to search.
దిల్ రాజుది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కదా..?
By: Tupaki Desk | 4 March 2021 8:40 AM GMTసినిమాల రిజల్ట్ విషయంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉంటుందని ఇండస్ట్రీలో అందరూ నమ్ముతుంటారు. చిన్న సినిమాల విషయంలో అయితే నటీనటులను చూసి కాకుండా కేవలం దిల్ రాజు బ్యానర్ చూసి ఆడియన్స్ థియేటర్లకు వచ్చేవారు. రెండేళ్ల క్రితం దాకా ఒకే ఏడాదిలో ఆరేడు సినిమాలు నిర్మించి హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో ఉండేవాడు. అయితే గత రెండేళ్లుగా దిల్ రాజు ఫామ్ తగ్గింది. ఆయన జడ్జిమెంట్ నిజమవ్వడం లేదు. 'లవర్' 'శ్రీనివాస కల్యాణం' 'ఇద్దరి లోకం ఒకటే' 'జాను' 'వి' వంటి సినిమాల విషయంలో దిల్ రాజు జడ్జిమెంట్ రాంగ్ అని ప్రేక్షకులు తేల్చేశారు. ఈ నేపథ్యంలో నా జడ్జిమెంట్ నిలబడుతుందని మరోసారి బల్లగుద్ది మరీ చెప్తున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్కే నాయుడు సాగర్ హీరోగా ''షాదీ ముబారక్'' అనే సినిమాని నిర్మించాడు దిల్ రాజు. పద్మశ్రీ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రేపు మార్చి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ ఈసారి తన జడ్జిమెంట్ గురి తప్పదని ధీమా వ్యక్తం చేశాడు. ''సాధారణంగా నేను ఏ సినిమాకి కూడా నా బ్యానర్ పేరు ఇవ్వను. స్క్రిప్ట్ దగ్గర నుంచి సినిమా పూర్తయ్యే వరకు అన్నీ మేము చూసుకుంటేనే మా పేరు వేసుకోనిస్తాం. ఫస్ట్ టైం నేను మధ్యలో జాయిన్ అయినా మా బ్యానర్ ద్వారానే ఈ సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నాం. ఇలాంటి చిన్న సినిమాలన్నీ నా జడ్జిమెంట్ ని నమ్మి కొనడానికి ముందుకొస్తారు. ఈ సినిమాను చూపించిన వెంటనే శాటిలైట్ వారు ఓటీటీ వారు కొనేశారు. అక్కడే నా జడ్జిమెంట్ సక్సెస్ అయింది. ఫైనాన్సియల్ గా బ్యాలన్స్ సినిమా అంతా నేనే పూర్తి చేశాను. మరి కొన్ని గంటల్లో నేను లక్కీ ఫెలోనా మీరు లక్కీ ఫెలోసా అనేది డిసైడ్ అవుతుంది'' అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. మరి 'షాదీ ముబారక్' విషయంలో దిల్ రాజుది ఓవర్ కాన్ఫిడెన్స్ నా? అతని జడ్జిమెంట్ నిజమవుతుందా? అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.