Begin typing your search above and press return to search.

అదే నువ్వు అదే నేను అనబోతున్న రాజు

By:  Tupaki Desk   |   19 Dec 2017 3:22 PM IST
అదే నువ్వు అదే నేను అనబోతున్న రాజు
X
'ఫిదా' సినిమాతో నిర్మాత దిల్ రాజు మనస్సంతా పూర్తి స్థాయి లవ్ స్టోరీస్ మీదకు మళ్ళిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఫిదా సినిమాలోని ప్యూర్ లవ్ స్టోరీ ఏ రేంజులో ఆడిందో.. ఆ సినిమాకు వచ్చిన షుమారు 50 కోట్ల షేర్ ను చూస్తే మనకు అర్ధమవుతుంది. అందుకే ఆ సినిమా తరువాత రాజ్ తరుణ్‌ తో 'లవర్' అంటూ మరో సినిమాను మొదలెట్టారు రాజు గారు. ఇప్పుడు మరో ప్రేమకథకు పచ్చ జెండా ఊపుతున్నారట.

ప్రేమకథల్లో ఉండేది ఒక ప్రియుడు ఒక ప్రేయసి ఒక ట్విస్టు అంటూ రొటీన్ ఫార్ములాయే కాని.. వాటిని సరిగ్గా తీస్తే మాత్రం ఎందుకో హృదయానికి హత్తుకుంటాయి. అందుకే లవ్ స్టోరీలో ఎన్నొచ్చినా కూడా.. జనాలను వాటిని అధరిస్తారు. అందుకే ఇప్పుడు దిల్ రాజు ''అదే నువ్వు అదే నేను'' పేరుతో ఒక లవ్ స్టోరీని తీస్తున్నారట. శశి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ.. ఈ సినిమాను రాజు నిర్మిస్తున్నారు. అయితే ఇందులో కొత్త నటీనటులు చేస్తారా లేదంటే స్టార్లు ఎవరన్నా చేస్తారా అనే విషయం తెలియదు కాని.. ఈ సినిమాలో మాత్రం లవ్ స్టోరీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది అంటున్నారు రాజు.

ఇకపోతే ఈ గురువారం 'ఎంసిఏ' సినిమాతో అదేదో ఆరో సిక్సర్ కొట్టేస్తాను అంటూ ఆయన ఉవ్విళ్ళూరుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఓ మై ఫ్రెండ్ అంటూ ఒక డిజాష్టర్ తీసిన దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా.. ఈ సినిమా రిజల్ట్ పై చాలా అంచనాలు పెట్టుకున్నాడు. అది సంగతి.