Begin typing your search above and press return to search.
దిల్ రాజు కోతల పని మొదలెట్టాడా?
By: Tupaki Desk | 13 July 2017 9:40 AM GMTసినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ పట్టున్న ఓ నిర్మాత దిల్ రాజు. మేకింగ్ విషయంలో దర్శకులకి కావల్సినంత స్వేచ్ఛ ఇస్తూనే, ఆ సినిమా తన మెజర్మెంట్స్ ప్రకారమే రూపుదిద్దుకొనేలా జాగ్రత్తపడుతుంటాడు. అందుకోసం ఎడిటింగ్ టేబుల్ దగ్గర పక్కాగా వ్యవహరిస్తుంటాడని చెబుతుంటారు. సినిమా క్రిస్పీగా - మంచి రన్నింగ్ తో ఉండాలనేది దిల్ రాజు ఆలోచన. సన్నివేశాలు మరీ ల్యాగ్ తో ఉంటే ప్రేక్షకుడు ఎంజాయ్ చేయలేడంటుంటాడు దిల్ రాజు. అందుకే దర్శకులు ఎంత ఇష్టంగా తీసినా.. దిల్ రాజు మాత్రం కథకి అవసరం లేవనుకొన్న సన్నివేశాల్ని నిర్మొహమాటంగా లేపేస్తుంటాడు. ఆయన నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన చాలా సినిమాలకి దిల్ రాజు స్వయంగా కోతలు పెట్టేశాడు.
తాజాగా ఫిదా విషయంలోనూ ఆయన కోతల పనిని మొదలుపెట్టినట్టు తెలిసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం `ఫిదా`. శేఖర్ కమ్ముల సినిమా అంటే కాస్త డిటైల్డ్ గా ఉంటాయి. ఫీల్ కలిగేందుకని కొన్ని సన్నివేశాల్ని సుదీర్ఘంగా తీస్తుంటాడాయన. అయితే దిల్ రాజు మాత్రం సినిమా మొత్తాన్ని చూసి కొన్ని సన్నివేశాల్ని తొలగించాలని నిర్ణయించాడట. ఆ సన్నివేశాల నిడివి దాదాపుగా 25 నిమిషాలపైనే ఉంటుందని ప్రచారం సాగుతోంది. శేఖర్ కమ్ముల కూడా అందుకు ఓకే చెప్పినట్టు తెలిసింది. కొంతకాలంగా శేఖర్ కమ్ములని పరాజయాలు వెంటాడుతున్నాయి. అందుకే ఈసారి ఆయన కూడా దిల్ రాజు సూచనలకి తగ్గట్టుగానే పనిచేశాడని తెలిసింది. మొత్తంగా దిల్ రాజు, శేఖర్ కమ్ముల ఈసారి క్రిస్పీగా ఫిదా చేస్తారన్నమాట.