Begin typing your search above and press return to search.
కార్తికేయ కాంబోని సెట్ చేసిన దిల్ రాజు
By: Tupaki Desk | 20 Oct 2017 5:40 AMటాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ప్రస్తుతం దిల్ రాజు ఒకరు. పరభాషా సినీ ప్రముఖులకు కూడా దిల్ రాజు స్టామినా బాగా తెలుసు. అందుకే శంకర్ దిల్ రాజు తో చాలా క్లోజ్ గా ఉంటారు. అదే విధంగా వారి కలయికలో భారతీయుడు 2 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే దిల్ రాజు ఎక్కువగా చిన్న హీరోలతో ఎక్కువగా సినిమాలను తీస్తూ స్టార్ హీరోస్ రేంజ్ లో హిట్ అందుకునేలా సినిమాను నిర్మిస్తారు.
కథ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే పాయింట్ ని ఆయన ఇట్టే పసిగట్టేయగలరు. ఈ ఏడాది దిల్ రాజు పట్టినదల్లా బంగారమే అవుతోంది. ఆయన గత సినిమాలకంటే ఈ సారి భారీ విజయాలను అందుకుంటున్నాయి. అయితే దిల్ రాజు రీసెంట్ గా మరో హిట్ కాంబినేషన్ ని సెట్ చేశాడు. యంగ్ హీరో నిఖిల్ - చందు మొండేటి కాంబినేషన్ లో కార్తికేయ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిన విషయమే.
అయితే మరోసారి ఈ కాంబో లో ఒక సినిమాకు దిల్ రాజు ప్లాన్ చేశాడు. ప్రస్తుతం చందు మొండేటి - నాగ చైతన్యతో సవ్యాసాచి అనే ఒక డిఫరెంట్ సినిమాను తీస్తున్నాడు. అలాగే నిఖిల్ - కిరిక్ పార్టీ అనే రీమేక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ఇద్దరి ప్రాజెక్ట్స్ అయిపోయేసరికి ఇంకా టైమ్ పడుతుంది. దీంతో దిల్ రాజు నెక్స్ట్ ఇయర్ ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ ని సెట్స్ పైకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.