Begin typing your search above and press return to search.
దిల్ రాజు వర్సెస్ వరంగల్ శ్రీను
By: Tupaki Desk | 27 April 2022 2:30 AM GMTనైజాం లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ చేయాలంటే ముందు వరుసలో వినిపించే పేరు దిల్ రాజు. ఆ తరువాతే మరెవరైనా. కానీ ట్రెండు మారింది. ఇప్పడు నైజాంలో స్టార్ హీరో సినిమా అంటే మరో పేరు వినిపిస్తోంది. అదే వరంగల్ శ్రీను. ఏ పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నా ముందుగా ఈ పేరే వినిపిస్తోంది. వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన వరంగల్ శ్రీను గత కొంత కాలం క్రితం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించారు. వరుసగా క్రేజీ చిత్రాలని సొంతం చేసుకున్నారు.
మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `క్రాక్` చిత్రంతో నైజాం లో డిస్ట్రిబ్యూటర్ గా తన జైత్రయాత్ర మొదలు పెట్టారు. దిల్ రాజు పోటీ పడే ప్రతీ చిత్రం వెంట పడుతూ అదే చిత్రాలని దక్కించుకుంటూ రిలీజ్ చేస్తున్నారు. దీంతో అనతి కాలంలోనే వరంగల్ శ్రీను ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. దిల్‌రాజు విడుదల చేయాలని ఎదురుచూసిన ప్రతీ సినిమాని నైజాం ఏరియాలో రిలీజ్ చేస్తూ క్రమక్రమంగా తన ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు.
దీంతో గత కొంత కాలంగా నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలో వరంగల్ శ్రీను వర్సెస్ దిల్ రాజు అనే లెవెల్లో ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. సాదా సీదాగా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంటరైన వరంగల్ శ్రీను స్టార్ హీరోల సినిమాలు మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తూ హాట్ టాపిక్ గా మారాడు. కార్తి `సుల్తాన్`, నితిన్ చెక్, విశాల్ చక్ర, నరేష్ నాంది చిత్రాలతో హిట్ లు ఫ్లాపుల్ని సంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఎవరు ఎదురొచ్చినా తగ్గేదేలే అంటూ దిల్ రాజు కు పోటీగా ముందుకు సాగుతున్నాడు.
వీరి మధ్య నెలకొన్న పోటీ తాజాగా పతాక స్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది. కారణం మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన `ఆచార్య`. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలని స్పీడప్ చేశారు. వరుస మీడియా ఈవెంట్ లతో సినిమాకు హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో వరంగల్ శ్రీను రిలీజ్ చేస్తున్నారు.
ఇందు కోసం భారీ స్థాయిలో 43 కోట్లు చెల్లించి వరంగల్ శ్రీను ఈ మూవీ నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని దక్కించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీని దిల్ రాజు రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అతనికి పోటీగా వెళ్లి వరంగల్ శ్రీను నైజాం హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఇప్పడు ఇదే ఈ చిత్రానికి నైజాంలో థియేటర్లు లేకుండా చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. వరంగల్ శ్రీను ను రిలీజ్ చేస్తున్న `ఆచార్య`కు ప్రధాన థియేటర్లు లభించకుండా దిల్ రాజు చాలా వరకు థియేటర్లని బ్లాక్ చేస్తున్నారట.
దిల్ రాజు ఇటీవల ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పటికే చాలా వరకు థియేటర్లలో ఈ రెండు చిత్రాలే ప్రదర్శింపబడుతున్నాయి. చాలా వరకు థియేటర్లు ఫుల్ కావడం లేదట. అయినా సరే `ఆచార్య`కు థియేటర్లు వదలడానికి దిల్ రాజు సుముఖంగా లేరని, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ వంకతో `ఆచార్య`కు నైజాంలో మెయిన్ థియేటర్లు ఇవ్వకుండా దిల్ రాజు బ్లాక్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై చిరు కలగజేసుకుంటారా? లేక వరంగల్ శ్రీను రంగంలోకి దిగుతాడా? అన్నది వేచి చూడాల్సిందే. రిలీజ్ మరో మూడు రోజులే వుండటంతో ఈ టాపిక్ ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ గా మారింది.