Begin typing your search above and press return to search.
దిల్ రాజుకు డైరక్టర్ కావలెను
By: Tupaki Desk | 23 April 2021 11:30 AM GMTఅదేంటి తెలుగు ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా వెలుగుతున్న దిల్ రాజుకు డైరక్టర్స్ దొరకకపోవటం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా. ఒక్కోసారి అంతే..ఎంతో మంది సక్సెస్ ఫుల్ డైరక్టర్స్ ని పరిచయం చేసిన దిల్ రాజు ఇప్పుడు ఓ డైరక్టర్ కావాలి అని అన్వేషిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇంతకీ ఏ హీరోని డైరక్ట్ చేయటానికి అంటారా..పవన్ కళ్యాణ్ ని. ఆశ్చర్యపోకండి...అసలు కథ చదవండి.
పవన్ కళ్యాణ్ తో రీసెంట్ గా వకీల్ సాబ్ తో సూపర్ హిట్ ఇచ్చారు దిల్ రాజు. సెకండ్ వీక్ నుంచి సెకండ్ వేవ్ కరోనా తో థియోటర్స్ లో కలెక్షన్స్ డ్రాప్ అయ్యినా అప్పటికే మంచి లాభాల్లో ఉన్నారట ఆయన. ఫస్ట్ వీక్ లోనే చాలా భాగం రికవరీ ఉందిట. అలాగే డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ వంటి వాటితో సినిమా మంచి లాభాలు వచ్చాయట. ఈ నేపధ్యంలో ఆయన వెంటనే పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చెయ్యాలనుకుంటన్నారట. పవన్ కు కూడా దిల్ రాజు ప్రొడక్షన్, ప్రమోషన్ అన్ని నచ్చాయట. దాంతో మరో సినిమాకు ఓకే అన్నారట. అంతా బాగానే ఉంది. కానీ డైరక్టర్ ఏడి. కథ ఏది..అప్పుడంటే పింక్ రీమేక్ దొరికింది.
వేణు శ్రీరామ్ చక్కగా హ్యాండిల్ చేసాడు. ఈ సారి మళ్లీ రీమేక్ చెయ్యాలా, లేక డైరక్ట్ కథ చెయ్యాలా అనేది ఓ డైలమో అయ్యితే పవన్ ని డైరక్ట్ చేసే డైరక్టర్ దొరకటం కూడా పెద్ద టాస్క్ గా మారిందిట. హరీష్ శంకర్ కానీ సురేందర్ రెడ్డిని కానీ సీన్ లోకి తెద్దామంటే వాళ్లిద్దరూ ఆల్రెడీ పవన్ తో సినిమా కమిటయ్యి ఉన్నారు. ఇంక మరో మార్గం..గోపాల గోపాల డైరక్టర్ డాలీని సీన్ లోకి తేవటమే. లేదా తన క్యాంప్ లో ఉన్న డైరక్టర్ ని పవన్ దగ్గరకు పంపి ఒప్పించటం. ఏం చేద్దామా అని దిల్ రాజు తన టీమ్ తో డిస్కషన్స్ చేస్తున్నారట. అయితే 2022 చివర్లో కానీ 2023 మొదట్లో కానీ ప్రాజెక్టు మొదలవుతుందిట. అప్పటిలోగా దిల్ రాజు ఎవరో ఒకరిని ఫైనలైజ్ చేసేస్తారనటంలో సందేహం లేదు.