Begin typing your search above and press return to search.
దిల్ రాజు కూడా ఆయనను తీసుకుని రాలేక పోయాడు
By: Tupaki Desk | 9 Jan 2023 4:30 AM GMTతమిళ్ స్టార్ హీరోల సినిమాలు తెలుగు లో మంచి బిజినెస్ చేయడం.. భారీగా వసూళ్లు చేయడం చూస్తూనే ఉన్నాం. సూర్య.. కార్తీ తో పాటు మరి కొందరు సీనియర్ మరియు జూనియర్ స్టార్ హీరోలు హైదరాబాద్ కు వచ్చి తమ సినిమాల యొక్క తెలుగు వెర్షన్ లకు ప్రమోషన్ చేయడం జరుగుతుంది. కానీ విజయ్ మరియు అజిత్ లు మాత్రం ప్రమోషన్ కు హైదరాబాద్ కు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
అజిత్ అంటే అక్కడ కూడా పెద్దగా ప్రమోషన్స్ కు ఆసక్తి చూపించడు. కానీ విజయ్ తమిళనాట తన సినిమాలకు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేయడం... కార్యక్రమాలకు హాజరు అయ్యి ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తూ ఉంటాడు. కానీ విజయ్ హైదరాబాద్ కు లేదా తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రదేశానికి సినిమా పబ్లిసిటీ కోసం వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
సినిమాల యొక్క షూటింగ్స్ కోసం హైదరాబాద్ కు తరచుగ వచ్చే విజయ్ సినిమా ప్రమోషన్స్ కోసం మాత్రం వచ్చేందుకు నిరాకరిస్తూ ఉంటాడు. ఈయన నటించిన పలు సినిమాలు ఇక్కడ విడుదల అయ్యాయి. అప్పట్లో విజయ్ సినిమాలకు తెలుగు లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ గత కొంత కాలంగా విజయ్ యొక్క మార్కెట్ స్థాయి పెరిగింది.
కాస్త సీరియస్ గా పబ్లిసిటీ చేసి సినిమాను జనాల్లోకి తీసుకువెళ్తే కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. అయినా కూడా విజయ్ మాత్రం తన సినిమాలకు ఇక్కడకు వచ్చి ప్రమోషన్ చేయడం లేదు. ఆయన సినిమాలు తీసుకున్న నిర్మాతలు ఎంతగా ప్రయత్నించినా కూడా ఆయన ఆసక్తి చూపించలేదు.
ఈసారి ఆయన తెలుగు లో వారసుడు చేశాడు. దిల్ రాజు తెలుగు లో విజయ్ తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు ని నిర్మించిన విషయం తెల్సిందే. తమిళనాట భారీ ఎత్తున ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ లో కూడా ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసి విజయ్ ను తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు.
కానీ దిల్ రాజు కూడా విజయ్ ను హైదరాబాద్ కు తీసుకురాలేక పోయాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమో కానీ కనీసం ప్రెస్ మీట్ కు కూడా విజయ్ ను హైదరాబాద్ కు దిల్ రాజు రప్పించ లేక పోయాడు అనే టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన వారసుడు ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. విజయ్ ప్రమోషన్స్ కు వస్తే ఇక్కడ కచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేది. విజయ్ రాకపోవడం సినిమా కు నష్టమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.