Begin typing your search above and press return to search.

దిల్ వాలే బాజీరావును డామినేట్‌ చేశాడు

By:  Tupaki Desk   |   19 Dec 2015 5:06 AM GMT
దిల్ వాలే బాజీరావును డామినేట్‌ చేశాడు
X
ఈ శుక్ర‌వారం రెండు భారీ బ‌డ్జెట్‌ సినిమాలు రిలీజ‌య్యాయి. షారూక్ ఖాన్ హీరోగా న‌టించిన దిల్‌ వాలే - సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన భాజీరావ్ మ‌స్తానీ... బాక్సాఫీస్ వ‌ద్ద పోటీపడ్డాయి. అయితే వీటిలో మొద‌టిరోజు వ‌సూళ్ల‌లో ఏ సినిమా టాప్ పొజిష‌న్‌ లో ఉంది? లాంగ్ ర‌న్‌ లో ప‌రిస్థితేంటి? అనే విష‌యాల్ని ఎన‌లిస్టులు విశ్లేషించారు. అయితే మెజారిటీ స‌మీక్ష‌కులు రెండు సినిమాల‌కు చ‌క్క‌ని మౌత్ టాక్ వ‌చ్చింద‌ని చెప్పారు. డిస్ర్టిబ్యూట‌ర్లు - రివ్యూవ‌ర్స్ నుంచి చ‌క్క‌ని స్పంద‌న‌లు వ‌చ్చాయి.

అయితే మొద‌టి రోజు మాత్రం దిల్‌ వాలే క్లీన్‌ స్వీప్ చేసేసింది. 70శాతం ఆక్యుపెన్సీతో భారీ వ‌సూళ్లు సాధించింది. ఇదో మాస్ మ‌సాలా రొమాంటిక్ సినిమా... కాబ‌ట్టి మాస్‌ లో దూసుకుపోయింద‌ని ఎన‌లిస్టులు చెప్పుకొచ్చారు. ప్ర‌ముఖ డిస్ర్టిబ్యూట‌ర్ కం ప్రొడ్యూస‌ర్ గిరీషీ వాంఖేడ్ చెబుతూ... తొలిరోజు దిల్‌ వాలే 21 నుంచి 22 కోట్లు వ‌సూలు చేస్తే, భాజీరావ్ కేవ‌లం 11 నుంచి 12 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేయ‌గ‌లిగింద‌ని చెప్పారు. ప్ర‌ముఖ ఎన‌లిస్టు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ చెప్పిన ప్ర‌కారం దిల్ వాలే వెరీ గుడ్ టు ఎక్స‌లెంట్ అన్న టాక్ తెచ్చుకుంద‌ని చెప్పారు. అలాగ‌ని భాజీరావ్ మ‌స్తానీని త‌క్కువ చేసి మాట్లాడ‌లేం. ఇవి రెండూ రెండు ర‌కాల జోన‌ర్‌ లు. భాజీరావ్ నెమ్మ‌దిగా ఎక్కే సినిమా. దిల్ వాలే మాస్ కంటెంట్ ఉన్న సినిమా కాబ‌ట్టి ఓపెనింగ్స్‌ లో దూసుకెళ్లింది. భాజీరావ్ మ‌స్తానీ చ‌క్క‌ని ఎమోష‌న‌ల్ వార్ ఎపిక్ సినిమా... ఈ సినిమాకి క్ర‌మంగా వ‌సూళ్లు పెరుగుతాయి. చాలా ఏరియాల్లో థియేట‌ర్లు ఫుల్స్ అవుతున్నాయి.. అంటూ విశ్లేషించారు.

రెండు సినిమాలు డిఫ‌రెంట్ జోన‌ర్‌ లో వ‌చ్చాయి కాబ‌ట్టి ఏ సినిమా వ‌సూళ్ల‌కు ఢోకా ఉండ‌దు. ఈ క్రిస్ మ‌స్‌ కి భారీగానే లాభాల్ని దండుకుంటాయి అంటూ విశ్లేషించారు. తొలిరోజు ఓపెనింగుల్లో అయితే దిల్‌ వాలే దూకుడు ముందు భాజీరావ్ నిల‌వ‌లేద‌నే అర్థ‌మైంది క‌దూ?