Begin typing your search above and press return to search.
స్టార్ హీరోను వదిలేసిన అమ్మ
By: Tupaki Desk | 12 July 2017 1:08 PM GMTమలయాళ స్టార్ హీరో దిలీప్ ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 14 రోజుల రిమాండ్ కు కూడా దిలీప్ ను పంపారు. సినీ నటి కిడ్నాప్ ఉందంతంలో ప్రధాన నిందితుడు.. జైల్ నుంచి దిలీప్ ను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో.. కేసుపై కూపీ లాగిన పోలీసులు చివరకు దిలీప్ ను అరెస్ట్ చేసేశారు.
ఇలా అరెస్ట్ చేసిన వెంటనే అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్) అత్యవసర భేటీ నిర్వహించింది. కాసేపటికే.. సంస్థ తరఫున మాట్లాడిన సూపర్ స్టార్ మమ్ముట్టి.. దిలీప్ సభ్యత్వాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అక్రమాలకు పాల్పడే వారికి తమ సంస్థలో స్థానం లేదని తెగేసి చెప్పారాయన. అలాగే.. ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఆమె కు పూర్తి మద్దతు ప్రకటించారు మమ్ముట్టి. కేసు తేలేవరకూ ఈ సపోర్ట్ కంటిన్యూ చేస్తామని కూడా చెప్పారు. ఫిబ్రవరిలో కొచ్చి వెళుతుండగా.. ఆమె పై కిడ్నాప్ ప్రయత్నం.. లైంగికంగా వేధించడం జరగగా ధైర్యంగా ఫిర్యాదు చేసిందామె.
ఓ ఈవెంట్ లో మంజు వారియర్ మాట్లాడుతూ.. ఈ విషయంపై మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా.. అప్పటి నుంచి ఆమె కు మద్దతు పలికింది ఈ సంస్థ. అప్పట్లోనే దిలీప్ పేరు వినిపించగా.. ఇప్పుడు కథ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించే వరకూ వచ్చింది.