Begin typing your search above and press return to search.
మలయాళ హీరోయిన్ కేసులో మరో మలుపు
By: Tupaki Desk | 21 Nov 2017 10:44 AM GMTమలయాళ స్టార్ హీరోయిన్ పై ఈ ఏడాది ఆరంభంలో జరిగిన కిడ్నాప్..లైంగిక దాడికి సంబంధించిన కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు నుంచి మలయాళ స్టార్ హీరో దిలీప్ తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వస్తున్నఊహాగానాలకు బలం చేకూర్చే సమాచారం బయటికి వచ్చింది. ఈ కేసులో దిలీప్ ను అందరూ ప్రధాన నిందితుడిగా భావిస్తుండగా.. ఛార్జి షీట్లో మాత్రం అతడిని ఎ-1గా కాకుండా ఎ-8గా పేర్కొనడం విశేషం. హీరోయిన్ని కిడ్నాప్ చేసి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడింది పల్సర్ సుని బృందమే అయినప్పటికీ కుట్రకు సూత్రధారి దిలీప్ అని భావిస్తున్న నేపథ్యంలో అతడే ప్రధాన నిందితుడు అవుతాడని అంతా అనుకున్నారు. కానీ పోలీసులు ఆశ్చర్యకరంగా అతడిని 8వ నిందితుడిగా పేర్కొన్నారు. దీంతో క్రమంగా ఈ కేసును నీరుగార్చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి దాదాపు 80 రోజుల పాటు జైల్లో ఉన్న దిలీప్.. అక్టోబర్ 3న బెయిల్ మీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
దర్యాప్తులో ఈ స్టార్ హీరోకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలేవీ లభించకపోవటంతోనే ఆయన పేరును 8వ నిందితుడిగా మార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఐతే నిందితులు పల్సర్ సుని తదితరులు కుట్రలో దిలీప్ పాత్ర గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా.. మరో నిందితుడు ఛార్లీ మాత్రం దిలీప్ ప్రధాన సూత్రధారి అని ఆరోపిస్తుండటంతో పోలీసులు దిలీప్ పేరును ఛార్జ్ షీట్ నుంచి తొలగించే ఆస్కారం లేకుండా పోయింది. హీరోయిన్ మీద జరిపిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను నిందితులు తనకు చూపించారంటూ పోలీసుల ముందు చార్లీ ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ కేసు మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.