Begin typing your search above and press return to search.

దిలీప్ కేసు.. కుట్ర అతడిది కాదట

By:  Tupaki Desk   |   9 April 2018 1:03 PM GMT
దిలీప్ కేసు.. కుట్ర అతడిది కాదట
X
మలయాళ స్టార్ హీరోయిన్ ను కిడ్నాప్ చేసి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించిన కేసు కొత్త మలుపు తిరిగింది. ఆ కథానాయికకు వ్యతిరేకంగా కుట్ర పన్ని తనను కిడ్నాప్ చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ హీరో దిలీప్.. ఆ హీరోయిన్ని కిడ్నాప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన పల్సర్ సునీ కొత్త వాదన తెరమీదిక తెస్తున్నారు. అసలు ఆ హీరోయిన్ కు వ్యతిరేకంగా తాము కుట్ర చేయలేదని.. తమకు వ్యతిరేకంగా కొందరు కలిసి కుట్ర చేశారని అంటున్నారు. దిలీప్ మాజీ భార్య మంజు వారియర్ కు అతడికి తీవ్ర విభేదాలున్నాయి. అలాగే ప్రముఖ నటుడు..దర్శకుడు అయిన లాల్ కు అతడికి కూడా పడదు.

ఈ నేపథ్యంలో మంజు వారియర్.. లాల్..మరికొందరు కలిసి తనను దెబ్బ తీసేందుకు కుట్ర పన్నారని దిలీప్ అంటున్నాడు.హీరోయిన్ కిడ్నాప్ వ్యవహారంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని.. అదంతా కుట్ర పూరితంగా చేసి.. తమను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగిందని వాళ్లంటున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో హీరోయిన్ కిడ్నాప్ జరిగింది.కొన్ని రోజుల్లోనే పల్సర్ సునీని.. ఇతర నిందితుల్ని అరెస్టు చేశారు. ఆపై పోలీసు విచారణకు హాజరయ్యాడు దిలీప్. తర్వాత అతడిని రిమాండుకు తరలించారు. కొన్ని నెలల పాటు అతను జైల్లోనే ఉన్నాడు.పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమైన దిలీప్.. చివరికి గత ఏడాది చివర్లో బయటికి వచ్చాడు. ఈ కేసు సంగతి మాత్రం ఇంకా ఏమీ తేలలేదు. ఇప్పుడు దిలీప్.. పల్సర్ సునీ రివర్స్ అటాక్ మొదలుపెట్టిన నేపథ్యంలో కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.