Begin typing your search above and press return to search.
ఆపసోపాలు పడుతున్న బ్యూటీకి లిఫ్ట్
By: Tupaki Desk | 1 Feb 2020 5:33 AM GMTఅందాల కథానాయిక అను ఇమ్మాన్యుయేల్ కెరీర్ డైలమా గురించి తెలిసిందే. ఉప్పెనలా దూసుకొచ్చి చప్పున చల్లారిపోయిన ఈ అమ్మడు ఇటీవల టాలీవుడ్ లో అరకొర అవకాశాలైనా లేక ఎంతో విసిగి పోయినట్టే కనిపిస్తోంది. అజ్ఞాతవాసి ఫ్లాపయ్యాక ఎన్నో ఆశలు పెట్టుకున్న నా పేరు సూర్య తనని అంతే డిసప్పాయింట్ చేసింది. అటుపై ఉదయనిధి స్టాలిన్ సరసన తమిళంలో ఓ సినిమా చేసింది. కానీ ఏం లాభం? కెరీర్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందగా ఉంది.
టాలీవుడ్ కు వస్తూనే స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలతో నటించింది. నాని- పవన్ కళ్యాణ్- బన్ని- నాగచైతన్య వంటి స్టార్ల సరసన వరుసగా అవకాశాలు అందుకుంది. అందం.. అభినయం ఉన్న నాయికగా పేరొచ్చినా కెరీర్ ఆశించినంతగా సాగలేదు. రాశీ ఖన్నా...రకుల్ ప్రీత్ సింగ్ లా టాలీవుడ్ లో బీజీ నాయిక అవుతుందనుకుంటే ఊహించని విధంగా సీన్ రివర్స్ అయింది. గత ఏడాది కాలంగా అనూ ఖాళీగానే ఉంటుంది. చివరిసారిగా నాగచైతన్య సరసన శైలజా రెడ్డి అల్లుడు చిత్రంలో నటించింది. ఆ సినిమా అంచనాలను అందుకొవడంలో విఫలమవ్వడంతో టాలీవుడ్ కు పూర్తిగా దూరమైంది. ప్రస్తుత సన్నివేశంలో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వెయిట్ చేస్తోంది.
ఇలాంటి సమయంలో టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ అమ్మడికి లిప్ట్ ఇస్తున్నాడని తెలిసింది. ఆ యంగ్ హీరో కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సెకెండ్ లీడ్ కు అను ఇమ్మాన్యుయేల్ ని ఎంపిక చేసారు. ఫస్ట్ లీడ్ లో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేషన్ నటిస్తుండగా...సెకెండ్ లీడ్ కు ఈ హాటీని ఎంపిక చేసుకున్నారట. ఇన్నాళ్ల వెయిటింగ్ కి తగ్గట్టే ఇప్పుడిలా.. లక్ చిక్కిందనే చెప్పాలి.
కథానాయికలకు అసలే కెరీర్ స్పాన్ చాలా తక్కువ. టైమ్ కలిసి రానప్పుడు సక్సెస్ ఉండీ ఛాన్సులు దక్కని వాళ్లు ఉన్నారు. కీర్తి సురేష్ ఇలానే టాలీవుడ్ కి దూరమైంది. కానీ అను మాత్రం ఏడాది గ్యాప్ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతోనైనా హిట్టు కొడితే మరో రెండు మూడు అవకాశాలు రావడం కష్టమేమీ కాదు. లేదంటే పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది.