Begin typing your search above and press return to search.
మధుబాలతో దిలీప్ కుమార్ లవ్.. బ్రేక్ కహానీ
By: Tupaki Desk | 8 July 2021 11:30 PM GMTబాలీవుడ్ లెజెండ్రీ నటుడు దిలీప్ కుమార్ మృతి తర్వత ఆయనకు సంబంధించిన పలు పాత విషయాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన పెళ్లి నుండి మొదలుకుని ఆయన వివాదాస్పద విషయాల వరకు ఎన్నో రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఈయన గురించి పాజిటివ్ వార్తలు మాత్రమే కాకుండా నెగటివ్ కామెంట్స్ వచ్చేవి. ఎన్నో పుకార్లు ఈయనపై వచ్చాయి. వాటిలో కొన్ని నిజాలు కూడా ఉన్నాయని స్వయంగా ఆయనే తన బయోగ్రాఫీ ది సబ్స్టెన్స్ అండ్ ది షాడో లో చెప్పుకొచ్చాడు. ఆ బుక్ లో ముఖ్యంగా మధు బాల తో రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చాడు.
నేను మధు బాలతో ప్రేమలో ఉన్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.. మా ఇద్దరి పెళ్లికి మధుబాల తండ్రి నో చెప్పాడు అనేది కూడా కొందరు కథనాలుగా రాశారు. కాని అసలు విషయం అది కాదు. మేము ఇద్దరం నిజంగానే ప్రేమించుకున్నాం. సినిమా ఇండస్ట్రీలో అత్యంత చలాకీ హీరోయిన్ గా మధుబాల పేరు దక్కించుకుంది. ఆమె కు మంచి పేరు వచ్చిన తర్వాత కూడా అందరితో సరదాగా ప్రవర్తించడం నాకు నచ్చింది. ఒక మహిళకు ఉండాల్సిన లక్షణాలు అన్ని కూడా ఆమెకు ఉన్నట్లుగా అనిపించింది. నాలో బెరుకు ను బిడియంను పోగొట్టుకోవడానికి కారణం ఆమెనే. సెట్ లో చాలా కలుపుకుంటూ పోయే ఆమె మనస్థత్వం నాకు నచ్చింది. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను.
మేము ఇద్దరం పెళ్లి చేసుకునేందుకు అందరు ఒప్పుకున్నారు. కాని ఆమె తండ్రి కి ఒక నిర్మాణ సంస్థ ఉంది. ఆ నిర్మాణ సంస్థలో నా సినిమాలన్నీ కూడా ఉండాలని ఆయన కండీషన్ పెట్టాడు. ఆ కండీషన్ నాకు నచ్చలేదు. నా సినిమాల వ్యవహారం మరియు వ్యక్తిగత విషయాలకు అస్సలు లింక్ పెట్టవద్దని నేను మధు బాలతో మరియు ఆమె తండ్రితో కూడా చెప్పాను. కాని ఆయన మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఈ చర్చ వచ్చిన ప్రతి సారి కూడా మధు బాల నాకు అనుకూలంగా మాట్లాడుకుండా నన్న ఒప్పించేందుకు ప్రయత్నించేది. దాంతో నాకు కోపం వచ్చేది. అలా మేము ఇద్దరం విడిపోయాం అంటూ చెప్పుకొచ్చాడు. మధుబాలతో నే కాకుండా ఈయన మరో ఇద్దరు ముగ్గురు తో కూడా ప్రేమలో పడ్డాడు అనే వార్తలు వచ్చాయి.