Begin typing your search above and press return to search.
అవార్డ్ షో మతలబు పై సినిమా
By: Tupaki Desk | 22 July 2017 9:17 AM GMTసినిమా అంటే ఒక కథ ఉంటుంది అందులో హీరో హీరోయిన్లు ఉంటారు వాళ్ళ చుట్టూ కొన్ని సంఘటనలు సంఘర్షణలు ఉంటాయి. ఇవి ఏవి లేకుండా సినిమాలు ఎవరు తీస్తారు దేని పై తీస్తారు చెప్పండి. కానీ ఇప్పుడు అటువంటి కథ ఏమి లేకుండా కేవలం ఒక రియాలిటీ షో పై సినిమా రాబోతుంది. రియాలిటీ షో పై సినిమా అంటే రియాలిటీ షో చూసినట్లే కదా అనుకోకండి.. మనం చూస్తున్న రియాలిటీ షో వెనకాల మనకు తెలియని మాయ ప్రపంచం ఉంటుంది కదా.. దాన్ని ఈ సినిమా ద్వారా చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.
ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్) పై త్వరలో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ నిర్మాత వశు భగ్నానీ ఈ సినిమాను నిర్మించనున్నారు. మన దేశంలో రియాలిటీ షో పై మొదటిసారి సినిమా తీయడం ఇదే. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ సొనాక్షి సిన్హా - పంజాబ్ సూపర్ స్టార్ దిల్జీత్ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే మొదలైందట. ఇందులో ఐఫా లాంటి ఈవెంట్ కండక్ట్ చేయాలంటే.. ఎలాంటి వ్యయప్రయాసలు ఉంటాయో చూపిస్తారట. ఇందులో అవార్డ్స్ షో ఫుటేజ్ కూడా వాడేసి.. సూపర్ స్టార్లను కూడా చూపిస్తారట. “ఇలాంటి వైవిధ్యమైన కథలో నేను నటించడం నాకు ఒక పక్క సంతోషంగా మరోపక్క భయంగాను ఉంది. ఇది రియల్ స్టోరీ అయినా ఇది పూర్తి కామిడీ కథ. ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు నాకు అవార్డ్ షో హోస్ట్ చేసే అనుభవం ఉండటంతో ఈ సినిమా చేయడానికి మరింత ఉత్సాహంగా ఉంది'' అంటోంది సోనాక్షి.
ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్) అనేది బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన అవార్డ్ షో. మొదటిసారి ఈ ఐఫా వేడుక 2000లో జరిగింది అప్పటి నుండి ప్రతి ఏటా ఒక్కో సారి ఒక్కో దేశంలో ఈ ఐఫా ఉత్సవాలను జరుపుతున్నారు. ఐఫా తొలి వేడుకలు లండన్‌లోని మిలీనియం డోమ్‌లో జరిగింది. ఐఫాకు తొలి నుంచీ అమితాబ్ బచ్చన్ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. రియాలిటీ షో ని రియల్ గా చూపిస్తే మరి జనాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.