Begin typing your search above and press return to search.

దిల్ రాజుకు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిన 'వార‌సుడు'!

By:  Tupaki Desk   |   24 Nov 2022 11:36 AM GMT
దిల్ రాజుకు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిన వార‌సుడు!
X
గ‌త కొంత కొన్ని నెల‌లుగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు వార్త‌ల్లో నిలుస్తున్నారు. సినిమాల రిలీజ్ ల వివాదంతో పాటు టాలీవుడ్ సినిమాల షూటింగ్ ల బంద్ స‌మ‌యంలోనూ, `వార‌సుడు` సంక్రాంతి రిలీజ్ విష‌యంలోనూ దిల్ రాజు వార్త‌ల్లో నిలిచారు. తాజాగా మ‌రో విష‌య‌మై `వార‌సుడు` కార‌ణంగా దిల్ రాజు వార్తల్లో నిల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ `వారీసు`. ఇదే మూవీని తెలుగులో `వార‌సుడు`గా రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న‌హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీకి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని నిర్మాత దిల్ రాజు భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ రిలీజ్ కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌ని బ్లాక్ చేసిన‌ట్టుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

సంక్రాంతి స‌మ‌యంలో డ‌బ్బింగ్ సినిమాల‌కు ప్ర‌ధాన్య‌త ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్మాత‌ల మండ‌లి కూడా ప్ర‌క‌టించ‌డంతో దీనిపై పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. త‌మిళ వ‌ర్గాలు కూడా దీనిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. రీసెంట్ గా త‌మిళ ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుస్వామి తీవ్ర స్వ‌రంతో తెలుగు నిర్మాత‌ల మండ‌లిని హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. దీనిపై త్వ‌ర‌లోనే స్పందిస్తాన‌ని, ప్ర‌త్యేకంగా మీడియా స‌మావేశాన్ని కూడా ఏర్పాటు చేయ‌బోతున్నాన‌ని దిల్ రాజు ప్ర‌క‌టించారు.

దీంతో ఈ వివాదంపై ఆయ‌న స్పంద‌న ఏంటీ? అనే ఆస‌క్తి అంద‌రిలోనూ మొద‌లైంది. ఇదిలా వుంటే `వారీసు` మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది. ఈ సినిమాలోని ఓ స‌న్నివేశంలో ఎలిఫెంట్ ని చూపించార‌ట‌. దీనికి జంతు ప‌రిర‌క్ష‌ణ స‌మితి నుంచి ఎలాంటి అనుమ‌తులు తీసుకోలేద‌ని తెలిసింది. ఈ విష‌య‌మై ఎనీమ‌ల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిర్మాత దిల్ రాజుకు తాజాగా నోటీసులు పంప‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇంత వ‌ర‌కు రిలీజ్ చేసిన `వారీసు` స్టిల్స్ లో ఎలాంటి జంతువుల‌ని వాడిన‌ట్టుగా చూపించ‌లేదు.

కానీ సినిమాలో ఏగుల‌కు సంబంధించిన ఓ స‌న్నివేశాన్ని చిత్రీక‌రించార‌ట‌. దీనికి ఎలాంటి అనుమ‌తులు తీసుకోలేద‌ని తేల‌డంతో జంతు సంక్షేమ బోర్ట్ `వారీసు` చిత్ర బృందానికి తాజాగా నోటీసులు జారీ చేసింది. వ‌ణ్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టం 1972 రూల్ 7(2) షెడ్యూల్ 1 ప్ర‌కారం ఏనుగులకు ర‌క్ష‌ణ క‌ల్పిస్తూ చ‌ట్టం చేశారు.

దీని ప్ర‌కారం వీటిపై సినిమాలో ఎలాంటి చిత్రీక‌ర‌ణ‌లు చేయాల‌నుకున్నా ముంద‌స్తు అనుమ‌తి త‌ప్ప‌ని స‌రి. కానీ `వారీసు` బృందం దీని కోసం ఎలాంటి అనుమతులు తీసుకోనందున తాజా వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టం కింద నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.