Begin typing your search above and press return to search.
దిల్ రాజు పట్టుపడితే అంతే..
By: Tupaki Desk | 18 Feb 2022 3:30 PM GMTటాలీవుడ్ లో వున్న స్టార్ ప్రొడ్యూసర్ లలో యమ స్పీడుమీదున్న నిర్మాత దిల్ రాజు. గతంలో కంటే `వకీల్ సాబ్` తరువాత ఈయన స్పీడు మరీ ఎక్కువైంది. ఒక విధంగా చెప్పాలంటే భారీ ప్రాజెక్ట్ ల విషయంలో ఈయన స్పీడు జెట్ వేగంతో సాగుతూ ఇండస్ట్రీ వర్గాలకు షాకుల మీద షాకులిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేయడం తన కల అంటూ ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చిన దిల్ రాజు గత ఏడాది `వకీల్ సాబ్` తన కలని నెరవేర్చుకున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వున్న టాప్ స్టార్స్ అందరితో సినిమాలు తీసిన ఏకైక నిర్మాత ఘనతని సాధించాలని దిల్ రాజు కోరిక. ఆ కోరికని క్రమ క్రమంగా ఫుల్ ఫిల్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
నితిన్ - అల్లు అర్జున్ - రవితేజ - ప్రభాస్ -రామ్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - సాయి ధరమ్ తేజ్ - శర్వానంద్ - సిద్ధార్ధ్ - సునిల్ - నాని - వరుణ్ తేజ్ - వెంకటేష్ - నాగార్జున - పవన్ కల్యాణ్.. వరుణ్ సందేశ్ - రాజ్ తరుణ్ .. వంటి హీరోలందరితో వరుసగా సినిమాలు నిర్మించి బారీ విజయాల్ని సొంతం చేసుకున్న దిల్ రాజు కన్ను ఇప్పుడు మిగిలిన ఇద్దరు హీరోలపై పడింది.
మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. త్వరలో ఈ ఇద్దరు హీరోలతో సినిమాలు చేస్తే దిల్ రాజు నిర్మాతగా సరికొత్త రికార్డుని సృష్టించిన నిర్మాతగా టాలీవుడ్ లో నిలిచిపోతారు. అందు కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సగుతున్న దిల్ రాజు తాజాగా అనుకున్నట్టే నందమూరి బాలకృష్ణ చిత్రాన్ని దక్కించుకున్నాడు. అనిల్ రావిపూడి ప్రస్తుతం `ఎఫ్ 3` చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 27న రిలీజ్ కు రెడీ అయిపోయింది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్ ని నందమూరి బాలకృష్ణ తో చేయబోతున్న విషయం తెలిసిందే.
అనిల్ రావిపూడి మార్కు ఎంటర్ టైనర్ గా తెరపైకి రానున్న ఈ మూవీ ముందు వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లింది. అయితే అనిల్ ని లైన్ లో పెట్టిన దిల్ రాజు ... బాలయ్య ప్రాజెక్ట్ ని చేజిక్కించుకుని తన పంతం నెగ్గించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వున్న జోరులోనే బాలయ్యతో సినిమా చేయాలని ఫిక్స్ అయిన దిల్ రాజు పట్టుపట్టి మరీ అనిల్ రావిపూడి - బాలకృష్ణల ప్రాజెక్ట్ ని తన బ్యానర్ లో చేసేలా పాచిక వేసి మరి దక్కించుకోవడం ప్రాధాన్యతని సంతరించుకుంది.
దీనికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఈ మూవీని ఈ ఏడాది మిడిల్ లో పట్టాలెక్కించబోతున్నారు. బాలకృష్ణ ముందు ఈ మూవీని వేరే ప్రొడ్యూసర్ తో చేయాలని కమిట్ అయ్యారు. అనిల్ రావిపూడి కూడా అదే నిర్మాతకు కమిట్ అయ్యారు కూడా.. అయితే ఈ ముగ్గురినీ కన్విన్స్ చేసిన దిల్ రాజు మొత్తానికి తన పంతం నెగ్గించుకోవడం విశేషం.