Begin typing your search above and press return to search.

ఇక నుండి రాజు గారి డైరెక్ట్‌ ఇన్వాల్వ్‌ మెంట్‌

By:  Tupaki Desk   |   6 Sept 2022 3:03 PM IST
ఇక నుండి రాజు గారి డైరెక్ట్‌ ఇన్వాల్వ్‌ మెంట్‌
X
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌ అనగానే ఠక్కున వినిపించే పేర్లలో దిల్ రాజు ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆయన సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్ గా మొదలు అయిన ఆయన టాలీవుడ్ ప్రస్థానం ఇప్పుడు టాలీవుడ్‌ లో టాప్‌ ప్రొడ్యూసర్ గా నిలిచాడు.

దిల్‌ రాజు మల్టీ ట్యాలెంటెడ్‌ అంటూ ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు. ఆయన చాలా విషయాలను లో లోపలే దాచుకుంటూ ఉంటారు. అవసరం వచ్చినప్పుడు తన ప్రతిభను ఒక్కొక్కటి చొప్పున బయట పెడుతూ ఉంటాడు. ఒక దర్శకుడు లేదా రచయిత తన వద్దకు వచ్చి కథ చెప్పిన సమయంలో ఒక రచయితగా మారి పోయి ఆ కథలో లోటుపాట్లను గుర్తిస్తాడు.

సినిమా మేకింగ్‌ సమయంలో దర్శకుడికి తనదైన శైలిలో ఇన్ పుట్స్ ఇస్తూ ఉంటాడు. ఇక రీ రికార్డింగ్‌ మొదలుకుని అన్ని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ సమయంలో కూడా దిల్‌ రాజు తన యొక్క ముద్రను తన సినిమాల్లో ఉండేలా చూస్తాడు. తన సినిమాలకే మాత్రమే కాకుండా ఇతర నిర్మాతల యొక్క సినిమాల యొక్క ఎడిటింగ్‌ రూమ్ లో కూర్చున్న ఘనత దిల్‌ రాజుకు దక్కుతుంది.

ఇలా సినిమాకు సంబంధించి అన్ని విభాగాల్లో కూడా ఇండైరెక్ట్‌ గా ఇన్వాల్వ్‌మెంట్‌ ఉన్న దిల్‌ రాజు ఇక నుండి నేరుగా ఇన్వాల్వ్‌ అవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దిల్‌ రాజు సొంతం గా ఒక కథను రాస్తున్నాడట.

ఇప్పటి వరకు తన ప్రొడక్షన్ హౌస్‌ లో ఉండే రైటర్స్ కి స్టోరీ లైన్ ఐడియాలు ఇచ్చి సన్నివేశాలకు ఐడియాలు ఇచ్చి రాయించిన దిల్‌ రాజు ఇప్పుడు సొంతంగానే ఒక కథను రాస్తున్నాడని.. దాని స్క్రిప్ట్‌ వ్యవహారం కూడా ఆయనే చూసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. ఆ కథ ఏంటి.. ఎవరి కోసం అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్.

ఆ కథను తానే దర్శకత్వం చేస్తాడా లేదంటే మరో దర్శకుడికి ఇస్తాడా అనేది కూడా చూడాలి. మొత్తానికి సినిమా నిర్మాణంలో కాకుండా ఇతర విషయాల్లో దిల్‌ రాజు డైరెక్ట్‌ ఇన్వాల్వ్‌ మెంట్ మొదలు అవ్వడంతో ముందు ముందు తప్పకుండా ఆయన నుండి ఏదో ప్రత్యేకమైనది ఆశించవచ్చు అనిపిస్తుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.