Begin typing your search above and press return to search.

మ‌హేష్ కండిష‌న్ల‌కు రాజ‌న్న వెన‌క‌డుగు!

By:  Tupaki Desk   |   2 Nov 2019 4:59 PM GMT
మ‌హేష్ కండిష‌న్ల‌కు రాజ‌న్న వెన‌క‌డుగు!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తున్నారు దిల్ రాజు. మ‌హ‌ర్షి త‌ర్వాత `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రాన్ని అనీల్ సుంక‌ర‌తో క‌లిసి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా త‌ర్వాత కూడా మ‌హేష్ తో దిల్ రాజు సినిమాల్ని కంటిన్యూ చేస్తారా? అంటే క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది.

రాజ‌న్న‌(దిల్ రాజు)కు మ‌హేష్ తో సినిమాలు కావాలి కానీ.. అత‌డు పెట్టే కండిష‌న్లకు మాత్రం నాట్ ఓకే అని తెలుస్తోంది. ఇప్ప‌టికే హిట్లు ఉన్న ద‌ర్శ‌కుల‌కు మ‌హేష్ వ‌రుస‌గా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు. వంశీ పైడిప‌ల్లి- సురేంద‌ర్ రెడ్డి వంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌కు ఓకే చెప్పేశారు. ఈ రెండు సినిమాల్ని దిల్ రాజుతో క‌లిసి కోప్రొడ్యూస్ చేసేందుకు మ‌హేష్ ఆస‌క్తి చూపిస్తున్నార‌ట‌. అయితే రాజుగారే వెన‌క‌డుగు వేస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మ‌హేష్ తో సినిమా కావాలి.. కానీ నో కండిష‌న్స్ అనేస్తున్నార‌ట‌. ఇక మ‌హేష్ ఎవ‌రితో సినిమా చేయాల‌న్నా ముందుగా `కండిష‌న్స్ అప్ల‌య్` అని ఖ‌రాకండిగా చెప్పేస్తుండ‌డంతో ఇక దిల్ రాజుతో బ్రేక్ ప‌డిపోయిన‌ట్టేన‌ని అంటున్నారు. ఇప్ప‌టికే తాను న‌టిస్తున్న ప్ర‌తి సినిమా పోస్ట‌ర్ పైనా జి.మ‌హేష్ బాబు ఎంట‌ర్ టైన్ మెంట్స్ లోగో ద‌ర్శ‌న‌మిస్తోంది. నిర్మాత ఎవ‌రైనా మ‌హేష్ భాగ‌స్వామ్యం త‌ప్ప‌నిస‌రి అవుతోంది. దాంతో పాటు కండీష‌న్లు అప్ల‌య్ అనేస్తుండ‌డంతో దిల్ రాజు అందుకు సుముఖంగా లేర‌ని మాట్లాడుకుంటున్నారు.