Begin typing your search above and press return to search.
దేవరకొండ-హరీష్ కాబోని అతను సెట్ చేస్తున్నాడా?
By: Tupaki Desk | 5 Sep 2022 7:56 AM GMTరౌడీస్టార్ విజయ్ దేవరకొండకి 'లైగర్' తో పరాభావం తప్పని సంగతి తెలిసిందే. సినిమాపై ఎన్ని ఆశలు పెట్టుకున్నారో అవన్నీ తొలి షోతోనే ఆవిరైపోయాయి. రౌడీ కెరీర్ లో డిజాస్టర్ గా తేలిన చిత్రమది. ఈ పరాజయం విజయ్ సహా టీమ్‌ని కాస్త డిస్టబెన్స్ కి గురి చేసింది. చిల్ గయ్స్ అంటూ ఛార్మీ పెట్టిన పోస్ట్ ని బట్టి టీమ్ ఎంతగా డిస్టబ్ అయిందన్నది అద్దం పడుతుంది.
సాధారణంగా బాక్సా ఫీస్ వద్ద సినిమా ఫెయిలైతే ఏ హీరో అయినా కాస్త ఇబ్బది పడటం సహజమే. అందులో విజయ్ దేవరకొండ మినహాయింపేం కాదు. కాకపోతే వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న విజయ్ ని ఇంకాస్త ఎక్కువగా డిస్టబెన్స్ చేసింది. కానీ యంగ్ హీరో మాత్రం 'లైగర్' రిలీజ్ అయిన మరుసటి రోజు నుంచే జిమ్ లో యధావిధిగా వర్కౌట్ లు షురూ చేసాడు.
పరాభవం నుంచి బయటకు రావడానికి ఇలాంటివి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. ఆ సంగతి పక్కనబెడితే విజయ్ తదుపరి సినిమాల షూటింగ్ మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. ఇప్పటికే ఆయన కథానాయుడిగా నటిస్తోన్న 'ఖుషీ' చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. బ్యాలెన్స్ షూట్ నని కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి తదుపరి సినిమా ప్రారంభించాలని చూస్తున్నాడు.
ఎలాగూ జనగణమన మధ్యలోనే ఆగిపోయింది కాబట్టి మరో కొత్త ప్రాజెక్ట్ ని అంతే వేగంగా లాక్ చేయాలి. మరి విజయ్ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడా? అంటే అవుననే వినిపిస్తుంది. విజయ్ కి దిల్ రాజు ఇప్పటికే తన బ్యానర్లో సినిమా చేసేలా కొంత అడ్వాన్స్ చెల్లించి ఉన్నారు. ఇది జరిగి చాలా కాలమవుతుంది. అయితే సినిమా చేయడం మాత్రం జరగలేదు.
ఈ నేపథ్యంలో రాజుగారు విజయ్ కి హరీష్ శంకర్ ని కలిపే ప్లాన్ లో ఉన్నట్లు లీకులందుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఖాళీగా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ డేట్లు కోసం హరీష్ చాలా కాలంగా ప్రయత్నించి విఫలమవుతున్నారు. భవదీయుడు భగంత్ సింగ్ టైటిల్ అయితే ప్రకటించారు గానీ పవన్ డేట్లు కేటాయించకుండానే ఇది జరిగిపోయింది.
అప్పటి నుంచి హరీష్ పవన్ జపం చేస్తూ ఆయన చుట్టూ తిరుగుతున్నారు. కానీ పీకే పొలిటికల్ బిజీ లో కేటాయిచడం కుదర్లేదు. దీంతో ఈ గ్యాప్ లో రాజుగారు విజయ్ హీరోగా హరీష్ దర్శకత్వంలో సినిమా చేయోచ్చు అన్న ఆలోచనతో కాంబినేషని సెట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. రాజుగారు బ్యానర్లో సినిమా అంటే హరీష్ ఎలాగూ కాదనరు కాబట్టి కాంబో సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.