Begin typing your search above and press return to search.

హ‌ర‌హ‌రా! తెలుగు సినిమాల‌కు కాపీనా?

By:  Tupaki Desk   |   20 Dec 2015 11:30 AM GMT
హ‌ర‌హ‌రా! తెలుగు సినిమాల‌కు కాపీనా?
X
షారూక్ ఖాన్ హీరోగా రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన దిల్‌ వాలే ఇటీవ‌లే రిలీజై బాక్సాఫీస్‌ ని కుమ్మేస్తోంది. అయితే ఈ సినిమాలో అంతే ఏం ఉంది? అస‌లేం పొడిచేసింది? అని వెతికిన వారికి చాలా నిష్ఠూర‌మైన నిజాలు తెలిశాయ్‌. ఓ జాతీయ - అంత‌ర్జాతీయ స్థాయి సినిమాకి ఉండాల్సిన ఒక్క ల‌క్ష‌ణం కూడా ఈ సినిమాకి లేదు. పైగా రోహిత్ శెట్టి చాలా తెలివిగా తెలుగు సినిమాలు కాపీ కొట్టేసి హిందీలో తీసేశాడ‌ని మ‌న‌వాళ్లు క‌నిపెట్టేశారు.

అపుడెపుడో బిసి కాలంలో రిలీజైన ర‌జ‌నీకాంత్ బాషా నుంచి కొన్ని సీన్లు - అప్ప‌ట్లో రిలీజై రికార్డులు తిర‌గ‌రాసిన చిరంజీవి ఇంద్ర నుంచి కొన్ని సీన్లు లేపేసి దిల్‌ వాలే సినిమా తీసేశాడు స‌ద‌రు ద‌ర్శ‌కుడు. హీరో ఎక్క‌డో పెద్ద మాఫియా డాన్‌ - క‌ట్ చేస్తే సింపుల్‌ గా ఓ మెకానిక్ షెడ్డులో ప‌నిచేసుకుంటూ బుద్ధిగా క‌నిపిస్తాడు. ఈ ఫార్ములాని ఆనాడే బాషాలో వాడేశాడు సురేష్‌ కృష్ణ‌. ఆ త‌ర్వాత ఇంద్ర సినిమాలో త‌న ఫ్యామిలీ హ‌త్య‌కు హీరోనే కార‌ణం అని అనుమానించే హీరోయిన్ ఉంటుంది. సేమ్ టు సేమ్ సీన్స్ దిల్‌ వాలేలోనూ వాడేశాడు రోహిత్ శెట్టి.

ఇప్పుడు వెళ్లి దిల్‌ వాలే సినిమా చూసి రండి. మీకే ఇవ‌న్నీ అర్థ‌మైపోతాయి. కామ‌న్ జ‌నాలు కూడా క‌నిపెట్టేసే సిల్లీ ట్రిక్స్ ఇవ‌న్నీ. మ‌న తెలుగు సినిమాలు కాపీ కొట్టి బాలీవుడ్‌ లో భ‌లే బంప‌ర్ హిట్లు కొట్టేస్తున్నారు బాబోయ్‌. మ‌న‌వాళ్లే కాపీ క్యాట్‌ లు అంటూ విమ‌ర్శిస్తుంటాం. ఇప్పుడు నేష‌న‌ల్ లెవ‌ల్ డైరెక్ట‌ర్లు చేస్తోందేంటి? టూ మ‌చ్ కాదు ఫోర్ మ‌చ్ క‌దూ?