Begin typing your search above and press return to search.
'భారతీయుడు 2' లో డింపుల్ హయతి జాక్ పాట్
By: Tupaki Desk | 21 Jun 2023 9:13 PM GMTహీరోయిన్‌గా అరంగేట్రం చేసినా అగ్ర హీరోల సరసన నటించినా ఆశించిన విజయాల్ని దక్కించుకోలేకపోయింది డింపుల్ హయాథీ. కానీ ఎనర్టిటిక్ డ్యాన్సర్ గా పెర్ఫామర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఐటెం సాంగ్స్‌తో ఆకట్టుకునే ఛామ్ డింపుల్ కి అదనపు అస్సెట్.
డింపుల్ హయాతి ఇటీవల ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. ఇంతలోనే ఊహించని అవకాశం. తాజా ఆఫర్ డింపుల్ కి బిగ్ బ్రేక్ కానుందని టాక్ వినిపిస్తోంది. విశ్వనటుడు కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ చిత్రం భారతీయుడు 2 (ఇండియన్ 2)లో డింపుల్ జాక్ పాట్ కొట్టేసిందని తెలిసింది.
భారీ అంచనాలు ఉన్న పాన్ ఇండియన్ మూవీలో ప్రత్యేక పాట కోసం ఆమెను ఎంపిక చేసినట్లు పుకారు షికార్ చేస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ డింపుల్ ఎనర్జీ డ్యాన్సింగ్ ప్రతిభపై శంకర్ కి ఆసక్తి ఉందని తెలుస్తోంది.
దర్శకుడు శంకర్ నుంచి తెలుగమ్మాయి అవకాశం అందుకుంటోంది అంటే అది పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ వార్త ఆమె అభిమానులలో పరిశ్రమ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తించింది. ఊహాగానాలు నిజమైతే డింపుల్ హయాతి జాక్ పాట్ కొట్టేందుకు ఆస్కారం లేకపోలేదు. ఇండియన్ 2 వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో పరిశ్రమ ప్రముఖులతో కలిసి పనిచేసే అవకాశం ఆమె కెరీర్‌ను కొత్త శిఖరాలకు చేర్చగలదు.
సినీ ప్రపంచంలోకి హయతి ప్రయాణం 'గల్ఫ్' అనే చిత్రంతో ప్రారంభమైంది. నటిగా ఆరంగేట్రమే ఆకట్టుకుంది. అయితే హరీష్ దర్శకత్వం వహించిన 'గద్దలకొండ గణేష్' సినిమాలో స్పెషల్ సాంగ్ ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టింది. 'అందాల ఆరబోత'తో చెలరేగడం తో ఓవర్ నైట్ సంచలనంగా మారింది. హయతి హిందీ చిత్రం 'అత్రంగి రే'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. నటిగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంది. 'వీరమై వాగై సూదుమ్'తో కోలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది.
రవితేజతో 'ఖిలాడీ' ఫ్లాప్. తర్వాత రామ బాణం పరాజయాన్ని మిగిల్చింఇ. అయినా ఎనర్టిటిక్ నటిగా డింపుల్ కి గుర్తింపు దక్కింది. ఇటీవల సెల్లార్ లో కార్ పార్కింగ్ విషయంలో డీసీపీతో వివాదంలో హెడ్ లైన్స్ లోకొచ్చింది. కారణం ఏదైనా శంకర్ దృష్టిలో పడింది డింపుల్. భారతీయుడు 2లో ఆఫర్ ఖాయమైతే తెలుగమ్మాయి జాక్ పాట్ కొట్టినట్టే.