Begin typing your search above and press return to search.
చీరలో చందమామలా డింపుల్ హయాతి..!
By: Tupaki Desk | 18 Jun 2023 7:00 PM GMTటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది డింపుల్ హయాతి. వరసగా సినిమా అవకాశాలు అందుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. అయితే, ఆమె అనుకున్నట్లు అవకాశాలు అయితే దక్కుతున్నాయి. కానీ, అవి హిట్ మాత్రం కావడం లేదు. దీంతో ఈ అమ్మడు కాస్త ఆ విషయంలో డిస్సప్పాయింట్ లో ఉంది.
గ్లామర్ విషయంలో మాత్రం చెలరేగిపోతుంది. పద్దతిగా లంగా వోణీలో కనిపించి మురిపించగలదు. హాట్ డ్రెస్సులు వేసి కూడా మెప్పించగలదు. ఖిలాడి మూవీలో ఈ రెండు వేరియేషన్స్ చూపించి ఆకట్టుకుంది. ఆ మూవీ కనుక క్లిక్ అయ్యి ఉంటే, అమ్మడి కెరీర్ మరోలా ఉండేది.
ఈ సంగతి పక్కన పెడితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తెలుపు రంగు చీరలో చందమామలా మెరిసిపోయింది. ట్రాన్సపరెంట్ చీరలో అందంగా కనిపించింది. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.
ఇక డింపుల్ హయాతి ఫిట్నెస్ విషయంలోనూ చాలా పర్టిక్యూలర్ గా ఉంటుంది. ఇటీవల తన ఫిట్నెస్ వీడియోని షేర్ చేయగా అందరూ నోరెళ్లపెట్టారు. ఆమె అంత కఠినమైన వ్యాయామాలను చేస్తుండటం విశేషం. పాపం ఫిట్ గా ఉండేందుకు ఎంత కష్టపడుతోందో ఈ వీడియోతో తెలిసిపోయింది. ఆమె కమిట్మెంట్ కి అందరూ ఫిదా అయిపోయారు.
ఇదిలా ఉండగా, ఇటీవల డింపుల్ ఓ వివాదం లో ఇరుక్కుంది. రీసెంట్‌గా ఆమె ఉంటున్న ఆపార్ట్‌మెంట్‌లో ఓ ఐపీయస్ ఆఫీసర్‌తో పార్కింగ్ వివాదం నెలకొంది. ఆమెపై పోలీసులు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు.
అయితే డింపుల్ ఆ వివాదంలో అస్సలు వెనక్కి తగ్గలేదు. హైకోర్టును కూడా ఆశ్రయించడం గమనార్హం. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం చాలా రోజులు నడవడం విశేషం. చివరగా ఆమె రామబాణం సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా అనుకున్నంత ఫలితం ఇవ్వకపోవడం గమనార్హం.